Allu Arjun: మరోసారి చిక్కుల్లో అల్లు అర్జున్.. కేసు నమోదు, యాడ్ లో తప్పుదోవ పట్టిస్తూ..

Published : Jun 10, 2022, 01:16 PM IST
Allu Arjun: మరోసారి చిక్కుల్లో అల్లు అర్జున్.. కేసు నమోదు, యాడ్ లో తప్పుదోవ పట్టిస్తూ..

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ హిందీ ప్రేక్షకులని కూడా అలరించాడు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ హిందీ ప్రేక్షకులని కూడా అలరించాడు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల బన్నీకి వరుసగా వివాదాలు ఎదురవుతున్నాయి. 

ఆ మధ్యన టీఎస్ఆర్టీసీ  స్థాయి తగ్గించేలా చేసిన ఓ యాడ్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాపిడో సంస్థ కోసం అల్లు అర్జున్ చేసిన యాడ్ వివాదంగా మారింది. దీని గురించి మరిచిపోక ముందే మరోసారి అల్లు అర్జున్ చిక్కుల్లో చిక్కుకున్నాడు. శ్రీ చైతన్య విద్యా సంస్థల కోసం అల్లు అర్జున్ ఓ యాడ్ లో నటించాడు. 

ఈ యాడ్ లో అసత్యాలు పేర్కొంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సామజిక కార్యకర్త ఉపేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6న శ్రీచైతన్య సంస్థకి చెందిన ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన మొత్తం తప్పుల తడకగా ఉందని అంటున్నారు. 

అసత్య  ప్రచారాలు చేసిన శ్రీచైతన్య విద్య సంస్థపై, అందులో భాగమైన అల్లు అర్జున్ పై అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

అల్లు అర్జున్ తన క్రేజ్ తో పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలు విషయానికి వస్తే పుష్ప 2 పూర్తయిన తర్వాతే అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టనున్నాడు. మరి పుష్ప 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?