Jersey Trailer: నానిని దించేసిన షాహిద్‌ కపూర్‌.. `జెర్సీ` హిందీ ట్రైలర్‌ ట్రెండింగ్‌

Published : Nov 23, 2021, 08:14 PM IST
Jersey Trailer: నానిని దించేసిన షాహిద్‌ కపూర్‌.. `జెర్సీ` హిందీ ట్రైలర్‌ ట్రెండింగ్‌

సారాంశం

తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన `జెర్సీ` సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్‌ హీరోగా నటిస్తున్న హిందీ `జెర్సీ `ట్రైలర్‌  తాజాగా విడుదలైంది. 

నాని(Nani), శ్రద్ధా శ్రీనాథ్‌ రూపొందిన `జెర్సీ`(Jaersey) చిత్రం తెలుగులో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విమర్శకులు ప్రశంసలందుకుంది. ఏకంగా జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా, బెస్ట్ ఎడిటింగ్‌ విభాగంలో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దర్శకుడిగా గౌతమ్‌ తిన్ననూరికి విశేష ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. మాతృక దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరినే హిందీ రీమేక్‌ తెరకెక్కిస్తున్నారు. 

బాలీవుడ్‌లో తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌రాజులు నిర్మిస్తున్నారు. నాని పాత్రలో షాహిద్‌ కపూర్‌(Shahid Kapoor) నటిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌గా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. తెలుగు సినిమాని యదాతథంగా రీమేక్‌ చేసినట్టు ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. సేమ్‌ ఎమోషన్స్ ట్రైలర్‌లో క్యారీ అవడం విశేషం. మాతృక మాదిరిగానే రీమేక్‌లో ట్రైన్‌ సీన్‌ తో షాహిద్‌ అదరగొట్టాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ట్రెండ్‌ అవుతుంది. అయితే నాని నటనకు మరెవ్వరు సాటి రారని అంటున్నారు నెటిజన్లు. ట్రైన్‌ సీన్‌ ని కంపేర్‌ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నాని అభిమానులు.

ఈ సినిమాని నిర్మిస్తున్న నిర్మాత అల్లు అరవింద్‌ కూడా ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవడం విశేషం. తెలుగు ఆడియెన్స్ ఈ సినిమాని ఎంతగా ఆదరిస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారనే విషయం దీనితో స్పష్టమవుతుంది. ఈ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపిస్తూ మాతృక నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభినందనలు తెలిపారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో రాణించాలనే ఓ మధ్యతరగతి యువకుడు పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో సాగే చిత్రమిది. నాని అద్భుతమైన నటనతో అదరగొట్టాడు.మరి హిందీలో ఎలాంటి ఫలాన్నిస్తుందో చూడాలి. 

also read: Priyanka Chopra: అంతా తూచ్‌..ఒక్క పోస్ట్ తో `డైవర్స్` రూమర్లకి చెక్‌ పెట్టిన ప్రియాంక చోప్రా

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే