సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సినిమాల్లోకి రాకముందు వారు ఏం చేసే వారు.? చిన్న తనంలో ఎలా ఉండేవారు? ఇలా రకరకాల అంశాలు నెట్టింట నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ అందాల తార చిన్న నాటి ఫొటో ఒకటి ఇలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు? ఆ కథేంటీ..
చిన్ననాటి ఫొటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక ట్రెండ్. త్రో బ్యాక్ పేరుతో ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు. దీంతో అభిమానులు తన అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉండేవారా అనుకుంటూ తెగ సంబురపడిపోతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పైన ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ ఒకప్పుడు స్టార్ నటీమణిగా రాణించింది. 90వ దశకంలో ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళంతో పాటు నార్త్‌లోనూ తన సత్తా చాటింది. దాదాపు అందరూ అగ్ర మీరోల సరసన నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ హోదాలో వెలుగువెలిగిన ఈ హీరోయిన్ ప్రస్తుతం వెండి తెరకు దూరమైంది. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంది. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం 50 ఏళ్ల వయసులోనూ వివాహం చేసుకోకుండా సింగిల్‌గానే ఉంది. అయితే పలువురు హీరోలతో పాటు, టీమిండియా మాజీ క్రికెటర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు సైతం వచ్చాయి. అయితే వీటిపై ఈ హీరోయిన్ ఎప్పుడూ స్పందించలేదు.
ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? చూడ్డానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరు కాదు అలనాటి అందాల తార నగ్మ. తాజాగా డిసెంబర్ 27వ తేదీతో 50వ పడిలోకి అడుగు పెట్టిన మీనాకు సంబంధించిన ఈ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. 1990లో బాలీవుడ్ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నగ్మా. అనంతరం పేదింటి అల్లుడు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 1991లో వచ్చిన కిల్లర్ మూవీతో తెలుగు కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలలో వేసుకుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.
సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం విషయంలో కూడా నగ్మా నిత్యం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రేవ వ్యవహారాలతో నగ్మ పేరు వార్తల్లో వినిపించింది. నటుడు శరత్ కుమార్, మనోజ్ తివారి, రవి కిషన్‌లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే నగ్మ మాత్రం ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న నగ్మా రాజకీయాల్లో యాక్టివ్‌గా మారింది. ప్రస్తుతం నగ్మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీరట్ నుంచి పోటీ చేసిన నగ్మ పరాజయం పొందిన విషయం తెలిసిందే. 2004లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీకలంగా ఉంది.