మాస్ రాజా రవితేజ సూపర్ ఫాస్ట్ గా కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నెక్ట్స్ ‘టైగర్ నాగేశ్వర రావు’ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీంతో తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ పై మేకర్స్ అప్డేట్ అందించారు.
మాస్ మహారాజ రవితేజ (RaviTeja) ఎంత స్పీడ్ గా సినిమాలు చేస్తూన్నారో చూస్తూనే ఉన్నాం. మూడునాలుగు నెలల గ్యాప్ లోనే థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. చివరిగా ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’, ‘రావణసుర’తో అలరించిన విషయం తెలిసిందే. ఇక నెక్ట్స్ ‘టైగర్ నాగేశ్వర రావు’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ తుదిదశకు చేరుకుంది. దీంతో వరుసగా అప్డేట్స్ అందిస్తున్నారు.
రవితేజ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరుచూస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. Tiger Nageswara Rao నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. మే24న ఫస్ట్ స్ట్రైక్ గా ఈ అప్డేట్ రానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఫస్ట్ రిలీజ్ అయ్యాక రచ్చే అంటున్నారు.
స్టూవర్టుపురం గజదొంగగా పేరొందిన టైగర్ నాగేశ్వర రావు పాత్రలో రవితేజ నటిస్తున్నారు. ఇప్పటికే చివరిగా షెడ్యూల్ కూడా పూర్తైంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టారు. ఈ క్రమంలో ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. చిత్రానికి వంశీ క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై భారీ స్కేల్లో నిర్మిస్తున్నారు. రవితేజ కేరీర్లోనే ఈ చిత్రం పాన్ ఇండియన్ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముుందుకు రానుంది.
Fierce and majestic 🔥 like you've never seen him 💥💥 first look on May 24th ❤️🔥 pic.twitter.com/AabvIAQ5in
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial)