Bigg Boss Telugu 7 : మొదటి ఐదుగురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. రూ.35 లక్షలు వదులుకున్నారే.!

Published : Sep 03, 2023, 08:47 PM ISTUpdated : Sep 03, 2023, 08:59 PM IST
Bigg Boss Telugu 7 : మొదటి ఐదుగురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. రూ.35 లక్షలు వదులుకున్నారే.!

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ గా ఈరోజు సాయంత్రం (సెప్టెంబర్ 3)న ప్రారంభమైంది. మొదటి ఐదుగురు కంటెస్టెంట్స్ కూడా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ అందరూ రిజెక్ట్ చేశారు.   

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం  (Bigg Boss Telugu 7) టీవీ ఆడియెన్స్  ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏడో సీజన్ చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి షోను మరింత కొత్తగా, ఇంట్రెస్టింగ్ టాస్క్ లు, నిబంధనలతో షురూ చేశారు. ప్రస్తుతం హౌజ్ లోకి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారందరూ హౌజ్ లో సందడి చేశారు. ఒకరినొకరు పరిచయం చేసుకోవడంతో పాటు బిగ్ బాస్ ఇచ్చే సూచనలతో ఇప్పుడే పోటీలోకి దిగారు. 

కాగా, బిగ్ బాస్ హౌజ్ లోకి మొదటి ఐదుగురు కంటెస్టెంట్లు టీవీ నటి ప్రియాంక జైన్, సీనియర్ నటుడు శివాజీ, సింగర్ దామిని, మోడల్ ప్రిన్స్ యావర్, లాయర్ సుభా శ్రీ ఎంట్రీ ఇచ్చారు. వారిలో హౌజ్ లో ఉండాలనే తాపాత్రయం ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు బిగ్ బాస్ వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సాధారణంగా ప్రతి సీజన్ లో లాస్ట్ ముగ్గురు కంటెస్టెంట్లకు అందించే బ్రీఫ్ కేస్ ను ముందే ఈ ఐదుగురు కంటెస్టెంట్ల ముందు ఉంచారు. 

ఆ బ్రీఫ్ కేస్ లో ఉన్న క్యాష్ ను తీసుకొని వెంటనే హౌజ్ లోంచి వెళ్లిపోయే అవకాశాన్ని ఆ ఐదుగురు కంటెస్టెంట్లకు కల్పించారు. వారిని టెంప్ట్ చేసేందుకు బిగ్ బాస్ అంతకంతకూ పెంచుతూ పోయినా ఎవరూ ఆ ఆఫర్ ను తీసుకోలేదు. రూ.ఐదు లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఆఫర్ చేసినా కంటెస్టెంట్లు తిరస్కరించారు. దీంతో బిగ్ బాస్ ఆ బ్రీఫ్ కేస్ ను స్టోర్ రూమ్ లో పెట్టమని ఆదేశించారు. మనీకి ఆశపడకుండా ఫేమ్, నేమ్ దక్కించుకోవాలనే ఆశతో, హౌజ్ లో ఉండాలని ఆశిస్తున్నామని కంటెస్టెంట్లు ఇచ్చిన ఆన్సర్ కు సంతృప్తి చెందారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి