#Bro.. 12 భాషల్లో రీమేక్‌.. సముద్రఖని ప్లాన్‌ మైండ్‌ బ్లోయింగ్‌..?

Published : Jul 11, 2023, 11:42 AM ISTUpdated : Jul 11, 2023, 12:09 PM IST
#Bro.. 12 భాషల్లో రీమేక్‌.. సముద్రఖని ప్లాన్‌ మైండ్‌ బ్లోయింగ్‌..?

సారాంశం

పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న `బ్రో` సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ తెలిసింది. దీన్ని 12 భారతీయ భాషల్లో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు సముద్రఖని.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `బ్రో`(ది అవతార్‌). తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రెండేళ్ల క్రితం తమిళంలో హిట్‌ అయిన `వినోదయ సీతం` చిత్రానికిది రీమేక్‌. మాతృక చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఆయనే ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాని ఇప్పుడు `బ్రో`గా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌తోపాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ప్రియా ప్రకాష్‌ వారియర్‌, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది. 

ఇదిలా ఉంటే `టైమ్‌` విలువ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. దేవుడికి కూడా టైమ్‌ రావాలి, టైమ్‌ బాగాలేకపోతే దేవుడు కూడా ఏం చేయలేదు, అన్నింటికంటే ముఖ్యం టైమ్‌ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ తెలిసింది. దీన్ని 12 భారతీయ భాషల్లో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు సముద్రఖని. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ అందరికి తెలియాల్సింది. టైమ్‌ విలువ తెలియాలి. అనే ఉద్దేశ్యంతో ఇండియాలో అందరికి తెలిసేలా ఈ సినిమాని తెలిసేలా చేయాలనుకుంటున్నారు ఆయన. 

ఇప్పటికే హిందీలో రీమేక్‌ ఫైనల్‌ అయ్యిందట. అక్కడ కూడా సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నారు. దీంతోపాటు కన్నడ, మలయాళం, ఒరియా, బోజ్ పూరి, బెంగాలీ, మరాఠి ఇలా అన్ని భాషల్లోనూ రీమేక్‌ చేసే ఆలోచనలో సముద్రఖని ఉన్నారట. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఎంత తక్కువ ఇచ్చినా పర్వాలేదు సినిమా తీసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. మరి సముద్రఖని ఆలోచన సాధ్యమవుతుంది. ఇప్పటికే ఓ భాష(తెలుగు)లో తెరకెక్కింది. మరో భాషలో రూపొందబోతుంది. మరో 9 భాషల్లో ఆయన దీన్ని రీమేక్‌ చేయడం సాధ్యమవుతుందా? అనేది చూడాలి. 

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు థమన్‌ మాట్లాడుతూ, సినిమా అద్బుతంగా వచ్చిందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ చాలా బాగా చేశారు. ఇరగదీశారని, ఓ కొత్త పవన్‌ని చూస్తారని తెలిపారు. ప్రత్యేకంగా క్లైమాక్స్ సీన్ లో ఆయన నటన కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. ఈ సీన్లు చూసి దర్శకుడు సముద్రఖని ఎమోషనల్‌ అయ్యారని, రేపు థియేటర్లలో ఆడియెన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారని తెలిపారు. అంతేకాదు తెరపై తనని, పవన్‌ని చూసినప్పుడు సాయితేజ్‌ కూడా ఎమోషనల్‌ అయ్యాడని చెప్పారు తమన్‌. 

అయితే ఇది రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమా కాదని, దీని మీటర్‌ వేరే అని చెప్పారు. అందుకే కథకి తగ్గట్టుగా మ్యూజిక్‌ చేశానని, ఇటీవల విడుదల చేసిన పాట పెద్దగా ఎక్కకపోవడానికి కారణమదే అన్నారు. ఓ ప్రమోషనల్‌ సాంగ్ కూడా ప్లాన్‌ చేస్తున్నామని, మొత్తం సినిమాలో మూడు పాటలుంటాయని చెప్పారు. ఈ సందర్భంగా `ఓజీ` అప్‌డేట్‌ ఇచ్చారు. దాని మీటర్‌ వేరే, దాని లెక్క వేరే అని తెలిపారు. మాస్‌ ఆడియెన్స్ కి కావాల్సిన విధంగా ఉంటుందన్నారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?