రష్మిక మందన్నా నుంచి ఫోన్‌ లాక్కున్న అభిమాని.. నేషనల్‌ క్రష్‌ రియాక్షన్‌ చూడాలి..!

Published : Jul 11, 2023, 09:53 AM IST
రష్మిక మందన్నా నుంచి ఫోన్‌ లాక్కున్న అభిమాని.. నేషనల్‌ క్రష్‌ రియాక్షన్‌ చూడాలి..!

సారాంశం

రష్మిక మందన్నా మాత్రం చాలా వరకు ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంటుంది. ఆమె ఎయిర్‌ పోర్ట్ వద్ద గానీ, స్టూడియోల వద్దగానీ తన కోసం వచ్చిన అభిమానులకు కచ్చితంగా ఫోటోలు ఇస్తుంది. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.. సౌత్‌లోనే అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటి. ఆమె సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌లో నెంబర్‌ 1 పొజిషియన్‌లో ఉన్నారు. అదే సమయంలో వరుస పాన్‌ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతంఈ బ్యూటీ చేతిలో రెండు భారీ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే హీరోయిన్లు ఎక్కడ కనిపించినా, అభిమానులు చుట్టిముట్టి సెల్ఫీల కోసం ఎగబడటం ఇటీవల రెగ్యూలర్‌గా జరుగుతుంది. షూటింగ్‌ సెట్‌లోనూ వారిని వదలడం లేదు. చాలా వరకు హీరోయిన్లు ఓపికగా వారికి ఫోటోలిస్తుంటారు. కొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. 

కానీ రష్మిక మందన్నా మాత్రం చాలా వరకు ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంటుంది. ఆమె ఎయిర్‌ పోర్ట్ వద్ద గానీ, స్టూడియోల వద్దగానీ తన కోసం వచ్చిన అభిమానులకు కచ్చితంగా ఫోటోలు ఇస్తుంది. అవి చాలా సార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా ఆమె ముంబయిలో షూటింగ్‌లో బిజీగా ఉంది. తన కారవ్యాన్‌లో ఉన్నప్పుడు కొంత మంది ఫ్యాన్స్ ఆమెని కలవడానికి వచ్చారు. వారికోసం వ్యాన్‌ నుంచి దిగిన రష్మిక వారికి సెల్ఫీలు, ఫోటోలు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఓ అభిమాని విషయంలో జరిగిన సంఘటన ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

ఫ్యాన్స్ వరుసగా ఫోటోలు దిగుతున్నారు. ఒకరు ఫోన్‌సరిగా పెట్టలేదు. రాంగ్‌ డైరెక్షన్‌లో పెట్టగా, దాన్ని తీసుకుని రష్మిక సరిచేయబోతుంది. కరెక్ట్ గా పట్టుకోవాలనే గైడెన్స్ ఇచ్చింది. కానీ సదరు అభిమాని మాత్రం అది పట్టించుకోకుండా ఆమెనుంచి ఫోన్‌ లాక్కోవడం ఆశ్చర్యపరుస్తుంది. కాస్త బలంగానే రష్మిక నుంచి అతను ఫోన్‌ లాక్కోగా రష్మిక కాస్త ఆశ్చర్యపోయింది. దాన్నుంచి వెంటనే తేరుకుని నవ్వుతూ రియాక్ట్ అయ్యింది. మరో అభిమానికి ఫోటో ఇచ్చింది. ఈ ఫన్నీ సన్నివేశాన్ని క్యాప్చర్‌ చేసిన అభిమాని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో రష్మిక రియాక్షన్‌ హైలైట్‌గా నిలిచింది. 

ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా.. హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` చిత్రంలో నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ఇది. ఆగస్ట్ లో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్‌ 1కి వాయిదా పడింది. మరోవైపు తెలుగులో బన్నీతో `పుష్ప2`లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. దీంతోపాటు నితిన్‌తో `భీష్మ` కాంబోలో మరో సినిమా చేస్తుంది. అలాగే `రెయిన్‌బో` అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ కూడా చేస్తుంది రష్మిక. ప్రస్తుతం ఈ నాలుగు ప్రాజెక్ట్ లతో ఆమె బిజీగా ఉంది. మరోవైపు అడపాదడపా గ్లామర్‌ ఫోటో షూట్లతో నెటిజన్లకి, తన అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ ఇస్తుందీ నేషనల్‌ క్రష్‌.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు