హైదరాబాదులోని విల్లాలో పనికి నటుడు కృష్ణుడు అరెస్ట్...!

Published : Sep 04, 2021, 11:37 AM ISTUpdated : Sep 04, 2021, 12:16 PM IST
హైదరాబాదులోని విల్లాలో పనికి నటుడు కృష్ణుడు అరెస్ట్...!

సారాంశం

మియాపూర్ లోని ఓ విల్లాలో పేకాట క్లబ్స్ నిర్వహిస్తున్నారనే సమాచారంపై పోలీసులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కృష్ణుడుతో పాటు నిర్వాహకుడు పెద్ది రాజు, పేకాట ఆడుతున్న పలువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

నటుడు కృష్ణుడు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ స్టేషన్ పరిధిలోని శిల్పా పార్క్, ఎల్ 159 విల్లాలో పేకాట క్లబ్స్ నిర్వహిస్తున్నారనే సమాచారంపై అర్ధరాత్రి పోలీసులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కృష్ణుడుతో పాటు నిర్వాహకుడు పెద్ది రాజు, పేకాట ఆడుతున్న పలువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ దాడిలో రూ. 1.97 లక్షలు నగదు 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు మియాపూర్ స్టేషన్ కి తరలించారు. ప్రముఖులు ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో విషయం బయటకు రానివ్వలేదు. కొంత మొత్తం పూచీ కత్తుపై వీరిని వెంటనే వదిలి పెట్టినట్లు సమాచారం. అయితే సాయంత్రం మరలా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పెద్ద పెద్ద వ్యాపారులతో పాటు సినీ ప్రముఖులు కొన్నాళ్లుగా మియాపూర్ విల్లాలో  పేకాట ఆడుతున్నట్లు తెలుస్తుంది. 

నటుడిగా పలు చిత్రాలలో పాత్రలు చేసిన కృష్ణుడు.. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాలలో హీరోగా కూడా నటించారు. ఇటీవల నిర్మాతగా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని హీరో ప్రభాస్ లాంచ్ చేయడం విశేషం. గతంలో ఓ అమ్మాయిని రేప్ చేశారన్న ఆరోపణలు కృష్ణుడు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే అది తప్పుడు ఆరోపణగా రుజువైంది.

PREV
click me!

Recommended Stories

Mannat Expansion: షారుఖ్ 'మన్నత్'కు మరో రెండు ఫ్లోర్లు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు!
Suriya Movie: రిలీజ్‌కు ముందే సూర్య మూవీ సంచలనం.. `విశ్వనాథ్ అండ్ సన్స్` బిజినెస్‌ ఎంతో తెలిస్తే ఫ్యూజుల్‌ ఔట్‌