Brahmastra Motion Poster: శివుడికి మరో రూపం.. `బ్రహ్మాస్త్ర` మోషన్‌ పోస్టర్ మైండ్ బ్లోయింగ్‌

Published : Dec 15, 2021, 08:28 PM ISTUpdated : Dec 15, 2021, 08:43 PM IST
Brahmastra Motion Poster: శివుడికి మరో రూపం.. `బ్రహ్మాస్త్ర` మోషన్‌ పోస్టర్ మైండ్ బ్లోయింగ్‌

సారాంశం

మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ః శివ` చిత్ర మోషన్‌ పోస్టర్‌ తాజాగా బుధవారం సాయంత్రం విడుదల చేశారు. విజువల్‌ వండర్‌గా సాగే ఈ మోషన్‌ పోస్టర్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉందని చెప్పొచ్చు.

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో `బ్రహ్మాస్త్ర`(Brahmastra) ఒకటి. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున(Nagarjuna), రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌(Alia Bhatt), మౌనీ రాయ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ః శివ` చిత్ర మోషన్‌ పోస్టర్‌ తాజాగా బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో విశ్వం నుంచి భగభగమండే అగ్ని ఖిలల నుంచి రణ్‌బీర్‌ కపూర్‌లోకి ఓ శక్తి రావడం, అది త్రిశూలంగా మారడం, శివుడి మాదిరిగా రణ్‌బీర్‌ కపూర్‌ త్రిశూలం పట్టుకుని పవర్‌ ఫుల్‌ లుక్‌ ఇవ్వగా, వెనకాల ఏకంగా శివుడి రూపం ప్రత్యక్షం కావడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

`బ్రహ్మాస్త్ర` సినిమాకిది పర్‌ఫెక్ట్ మోషన్‌ పోస్టర్‌గా నిలిచింది. విజువల్‌ వండర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని తాజా మోషన్‌ పోస్టర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన పెద్ద ఈవెంట్‌లో ఈ మోషన్‌ పోస్టర్‌ని ఆవిష్కరించారు. అంతేకాదు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న `బ్రహ్మాస్త్ర`ని విడుదల చేయబోతున్నట్టు యూనిట్‌ తెలిపింది. దీన్ని హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు. యావత్‌ ఇండియన్‌ ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్‌ చేస్తున్నీ సినిమా నుంచి బిగ్‌ అప్‌డేట్‌ రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా పురాతన భారతదేశం, ఆధునిక ప్రపంచం యొక్క పురాణ కలయిగా  సాగుతుందని తెలుస్తుంది.

ఈ సినిమా గురించి దర్శకుడు అయాన్‌ ముఖర్జీ స్పందిస్తూ, గత పదేళ్లుగా ఈ కథపై వర్క్ చేస్తున్నట్టు,ఈకథలో జీవించినట్టు చెప్పారు. ఈ సినిమా పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ టికెట్‌ ఎంటర్‌టైనర్‌ అని, భారతీయులు గతంలో ఎప్పుడూ ఇలాంటి కథని చూడలేదని చెప్పారు.  ఫాంటసీని, అండ్వెంచర్‌ని మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రం ఎప్పుడూ చూడని సినిమాటిక్‌ అనుభవాన్ని ఇస్తుందని దర్శకుడు తెలిపారు. ఎట్టకేలకు సినిమాని విడుదల చేయనున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, లార్జ్ స్కేల్‌లో, విజువల్‌ వండర్ గా `బ్రహ్మాస్త్ర` ఉంటుందన్నారు. మంచికి చెడుకి మధ్య పోటీ ప్రధానంగా సినిమా సాగుతుందన్నారు. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌, స్టార్‌లైట్‌ పిక్చర్స్ తో కలిసి ధర్మ ప్రొడక్షన్‌, ప్రైమ్‌ ఫోకస్‌ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. 

చాలా రోజుల తర్వాత నాగార్జున హిందీలో నటిస్తున్న సినిమా కావడం, `ఆర్‌ఆర్‌ఆర్‌`తో తెలుగులో సందడి చేయబోతున్న అలియాభట్‌ ఇందులో హీరోయిన్‌గా నటించడం, అలియాభట్‌, రణ్‌బీర్ కపూర్‌ ప్రేమలో ఉండటం, ఇదొక ఫాంటసీ చిత్రం కావడంతో `బ్రహ్మస్త్ర`పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన మోషన్‌ అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా విజువల్‌ వండర్‌గా మాత్రమే కాదు, అద్భుతమైన కథాంశంతోనూ మెప్పించబోతుందని తెలుస్తుంది. 

also read: ముఖం దాస్తూ అసలైన అందాలను ఓపెన్‌గా చూపిస్తున్న `పోకిరి` బ్యూటీ.. బికినీ జాతర ఇప్పట్లో ఆగేలా లేదుగా!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే