అవకాశాలు తగ్గడానికి కారణమిదే: బ్రహ్మానందం

Published : Oct 07, 2018, 11:20 AM IST
అవకాశాలు తగ్గడానికి కారణమిదే: బ్రహ్మానందం

సారాంశం

టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం గత కొంత కాలంగా చాలా వరకు సినిమాలు తగ్గించేశారు. గతంలో ఆయన లేనిదే స్టార్ హీరోల  సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు. బ్రహ్మి కామెడీ ఉండాల్సిందే అని దర్శకులు కూడా స్పెషల్ క్యారెక్టర్ ని డిజైన్ చేసేవారు. 

టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం గత కొంత కాలంగా చాలా వరకు సినిమాలు తగ్గించేశారు. గతంలో ఆయన లేనిదే స్టార్ హీరోల  సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు. బ్రహ్మి కామెడీ ఉండాల్సిందే అని దర్శకులు కూడా స్పెషల్ క్యారెక్టర్ ని డిజైన్ చేసేవారు. ఇకపోతే ప్రస్తుతం బ్రహ్మానందం ఏడాదిలో కనీసం 10 సినిమాల్లో కూడా కనిపించడం లేదు. 

ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా బుల్లితెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. లాఫ్టర్ ఛాలెంజ్’ అనే షోతో స్టార్ మాలో సందడి చేయనున్నాడు. ఈ షోపై గత కొంత కాలంగా పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే రీసెంట్ గా బ్రహ్మానందం మీడియా ముందుకు వచ్చికెరీర్ గురించి మాట్లాడారు. సినిమాలు తగ్గించడానికి గల కారణాల గురించి చెప్పారు. 

నటుడిగా ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో కనిపించాను.రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా కొంచెం డిఫెరెంట్ గా నాకు నచ్చిన పాత్రలనే చేస్తున్నాను. అదే విధంగా మిగతా కమెడియన్స్ కు కూడా అవకాశాలు ఇవ్వాలి. ఆ విషయం గురించి కూడా ఆలోచించాను. కొన్ని ఆఫర్స్ అలా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే బ్రహ్మానందం చెప్పిన విధానానికి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అవకాశాలు తగ్గితే ఈ విధంగా కామెడీ చేస్తున్నాడు ఏంటని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు