ఇలా అయితే బిగ్ బాస్ 3కి దిక్కెవరు?

By Prashanth MFirst Published Oct 7, 2018, 10:39 AM IST
Highlights

బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో ఏ విధంగా అదరగొట్టేశాడో స్పెషల్ గా చెప్పనవసరం ;లేదు. కంటెస్టెంట్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తరువాత తారక్ షోను నడిపించిన తీరు హౌస్ లో జరిగిన పరిణామాలు షోకు బలాన్ని చేకూర్చాయి. 

బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో ఏ విధంగా అదరగొట్టేశాడో స్పెషల్ గా చెప్పనవసరం ;లేదు. కంటెస్టెంట్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తరువాత తారక్ షోను నడిపించిన తీరు హౌస్ లో జరిగిన పరిణామాలు షోకు బలాన్ని చేకూర్చాయి. ఇక సెకండ్ సీజన్ లో కూడా అలానే జరిగినప్పటికీ హోస్టింగ్ జాబ్ చేసిన నానికి మాత్రం పెద్దగా లాభం చేకూరలేదు. 

సాధారణంగా బిగ్ బాస్ లాంటి షోను ముందుకు నడిపించే బాధ్యత వస్తే చాలా వరకు హీరోలు నో చెప్పరు. కానీ షో నేర్పిన అనుభవం ఇద్దరి హీరోలకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. తారక్ తీరిక లేకుండా గడపడం అప్పట్లో చాలా కష్టమైంది. ఇక నాని బాగానే కష్టపడ్డప్పటికీ ఊహించని విధంగా కొన్ని విమర్శలు అందుకున్నాడు. 

ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు బిగ్ బాస్ 3 కి దిక్కెవరు అనే పరిస్థితో ఏర్పడింది. నాని పడిన ఇబ్బందులను గురించి ఇతర హీరోలు తప్పకుండా తెలుసుకునే ఉంటారు. మొదటి సిజన్ లో తారక్ కు రెస్ట్ లేకపోవడం కూడా అందరికి తెలిసిందే. వీకెండ్ డేస్ లోనే కాకుండా మిగతా రోజులు కూడా షోని బాగా ఫాలో అవుతూ ఉండాలి. తారక్ - నాని అయితే హోస్ట్ జాబ్ చేయమని ఇప్పటికే క్లారిటీగా చెప్పేశారు. 

స్టార్ మాకి మంచి రేటింగ్ తెచ్చిన బిగ్ బాస్ ఆగిపోవడం అనేది జరగదు. మరి ఎంతో ప్రెజర్ తో కూడుకున్న ఈ షో హోస్ట్ జాబ్ కోసం నెక్స్ట్ ఎలాంటి హీరోను రప్పిస్తారో చూడాలి. 

click me!