బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా మరో ప్రయత్నం.. ఈ సారి డిఫరెంట్‌గా

Published : Mar 02, 2022, 09:46 PM IST
బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా మరో ప్రయత్నం.. ఈ సారి డిఫరెంట్‌గా

సారాంశం

బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ ఇప్పుడు మరోసారి సరికొత్తగా, డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. ఆయన హీరోగా రూపొందతున్న కొత్త సినిమా  గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది  చిత్ర యూనిట్.

హాస్యబ్రహ్మా బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమలో నవ్వుల రారాజుగా నిలిచిపోయారు. హాస్యనటులకు స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చారు. కమెడీయన్‌గా అత్యధిక సినిమాలు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఆయన తనయుడు గౌతమ్‌(Goutham)ని మాత్రం హీరోగా స్ట్రగుల్‌ అవుతూనే ఉన్నాడు. `పల్లికిలో పెళ్లికూతురు`, `వారెవా`, `బసంతి`, `మను` చిత్రాలతో ఆడియెన్స్‌ ముందుకొచ్చారు. ఈ సినిమాలతో నటుడిగా మంచి మార్కులే వేసుకున్నా.. కమర్షియల్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇప్పుడు మరోసారి సరికొత్తగా, డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. 

తాజాగా బ్రహ్మానందం(Brahmanandam) తనయుడు హీరోగా రూపొందతున్న కొత్త సినిమా  గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది  చిత్ర యూనిట్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తో టాలీవుడ్ ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్  ఓరిజినల్స్ బ్యానర్ నుండి ప్రోడక్షన్ నెం 10 గా నిర్మిస్తున్న ఈ సినిమా తో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ఒక బ్లాంక్ స్క్రీన్ పై వాయిస్  మొదలవతుంది . `ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా`  అనే డైలాగ్ తో గౌతమ్ లుక్ రిలీవ్ అవుతుంది.

ఈ డైలాగ్ లో గౌతమ్ క్యారెక్టర్ లోని పెయిన్ తెలుస్తుంది. అలాగే లుక్స్ కూడా రచయిత క్యారెక్టర్ ని ఫరెఫెక్ట్ గా మ్యాచ్ చేసే విధంగా ఉన్నాయి. ఆర్టిస్ట్ గా మనుతో సర్ ప్రైజ్ చేసిన  గౌతమ్ ఈ సారి మరో కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతున్నాడు.  మోనోఫోబియాతో బాధపడుతున్న రచయితగా కనిపిస్తున్నాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది..?  తను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని అతను ఎలా అధిగమించాడు అనేది థ్రిలింగ్ ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతుంది. 

ఈ  కాన్సెప్ట్ ని యునిక్ గా తెరకెక్కిచడంలో సుబ్బు చెరుకూరి తన దైన ముద్రను వేసాడని చిత్ర యూనిట్ అంటుంది.  ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిషెడ్యూల్  జరుపుకుంటుంది. ఎమ్ యస్ జోన్స్ రూపెర్ట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి  మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత సృజన్ యరబోలు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు