బ్రహ్మానందం ఆరోగ్య పరిస్దితి...ఆశ్చర్యకరమైన వార్త

Published : Feb 27, 2019, 07:52 AM IST
బ్రహ్మానందం ఆరోగ్య పరిస్దితి...ఆశ్చర్యకరమైన వార్త

సారాంశం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు రీసెంట్ గా  ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్‌ సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే.  ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో ట్వీట్లు, కామెంట్‌లు చేసిన ప్రార్ధనలు ఫలించి పూర్తిగా కోలుకున్నారు. 

 ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు రీసెంట్ గా  ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్‌ సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే.  ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్‌ మీడియాలో ట్వీట్లు, కామెంట్‌లు చేసిన ప్రార్ధనలు ఫలించి పూర్తిగా కోలుకున్నారు. అంతేకాదు ఆయన మళ్ల నటించటానికి సిద్దపడిపోతున్నారు. 

బ్రహ్మానందం రెస్ట్ తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. తనకు పనే ఎనర్జీ ఇస్తుందని, అదే ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్తున్నారు. ముంబై నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుని రాగానే టాలీవుడ్ స్టార్స్ అంతా ఆయన్ని పర్శనల్ గా కలిసి పలకరించారు. అంతేకాదు త్వరగా సెట్స్ కు వచ్చేయమన్నారు. 

అందులో భాగంగా ఆయన ఓ కొత్త సినిమా కమిటయ్యినట్లు సమాచారం. ఈ విషయాన్ని కమిడియన్ వెన్నెల కిషోర్ ఓ ట్వీట్ లో ఖరారు చేసారు.  బ్రహ్మానందం పూర్తిగా కోలుకున్నారు..త్వరలోనే సెట్స్ కు వచ్చేస్తున్నారని ఆయన ట్వీట్ చేసారు. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఓ చిత్రంలో ఆయన నటించబోతున్నట్లు సమాచారం. అతి తక్కువ టైమ్ లో కోలుకుని మళ్లీ సినిమా నటుడుగా బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్న బ్రహ్మానందం ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. 

ఇక వెయ్యికి పైగా సినిమాల్లో నటించి హాస్యలోకపు రారాజుగా వెలుగొందిన బ్రహ్మానందంకు ఇటీవల సినిమాలు తగ్గాయి.పరిశ్రమలో చిన్న పాత్రలలో నటన ప్రారంభించిన  బ్రహ్మానందం అతి తక్కువ కాలంలోనే  చాలామంది ఇష్టపడే హాస్యనటుడుగా ఎదిగారు. అత్యధిక సినిమాలో నటించిన నటుడుగా ఈయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందారు. అలాగే ఈయనకి 2009 లో పద్మ శ్రీ అవార్డు తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?