రామ్ చరణ్ లెటర్ తో బోయపాటి అప్సెట్!

Published : Feb 06, 2019, 01:52 PM IST
రామ్ చరణ్ లెటర్ తో బోయపాటి అప్సెట్!

సారాంశం

'వినయ విధేయ రామ' చిత్రంతో ఆకట్టుకోలేకపోయమని రామ్ చరణ్ నిన్న అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు.మిమ్మల్ని మెప్పించే సినిమా తీయలేకపోయాను అంటూ చరణ్ ఆ లేఖలో ప్రస్తావించాడు.

'వినయ విధేయ రామ' చిత్రంతో ఆకట్టుకోలేకపోయమని రామ్ చరణ్ నిన్న అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు.మిమ్మల్ని మెప్పించే సినిమా తీయలేకపోయాను అంటూ చరణ్ ఆ లేఖలో ప్రస్తావించాడు.రామ్ చరణ్ కెరీర్ లో కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన 'బ్రూస్ లీ' సినిమాపై భారీ అంచనాలు ఉండేవి.

కానీ సినిమా అట్టర్ ఫ్లాప్  అయింది. కానీ ఏ సినిమాకు రియాక్ట్ అవ్వకుండా 'వినయ విధేయ రామ' సినిమా ఫ్లాప్ పై రియాక్ట్ అవ్వడం దర్శకుడు బోయపాటి శ్రీనుని బాధిస్తోందట. ఈ లెటర్ కి సంబంధించి తన సలహా తీసుకోకపోవడం, లేఖలో ఎక్కడా తన పేరు ప్రస్తావించకపోవడంతో బోయపాటి అలిగారట. 

చరణ్ కూడా లేఖలో నిర్మాత దానయ్య పేరు ప్రస్తావించారే తప్ప బోయపాటి టాపిక్ అసలు తీసుకురాలేదు. దీంతో చరణ్ పై బోయపాటి గుర్రుగా ఉన్నట్లు టాక్. 'వినయ విధేయ రామ' సినిమా తరువాత రామ్ చరణ్, బోయపాటి మధ్య బాగా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన తరువాత ఇద్దరూ ఒకసారి కూడా కలుసుకోలేదట.

అందుకే లెటర్ విషయంలో చరణ్ సొంతంగా నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే బోయపాటి మాత్రం ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మిగిలిన వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా.. సినిమా అనేది అందరి కృషి అంటూ తన సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 
 

అభిమానులకు రామ్ చరణ్ లెటర్!

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు