బాల‌య్యని ' సీఎం' చెయ్య‌టంపై బోయపాటి ఏమంటారంటే...

By Prashanth MFirst Published Feb 1, 2019, 6:44 PM IST
Highlights

 నంద‌మూరి బాల‌కృష్ణ త్వరలో సీఎం పాత్రలో కనిపించబోతున్నార‌ని మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ వార్త‌లు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయమై దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియాతో ఈ విషయమై మాట్లాడుతూ అలాంటిదేమి లేదని తేల్చి చెప్పారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.."క్రితం సంవత్సరమే మా కాంబినేష‌న్లో మ‌ళ్లీ సినిమా చేయాల‌నుకున్నాం. ఎలక్షన్స్ కి ముందు విడుద‌ల‌య్యేలా ఒక పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ప్లాన్ చేసాం . కానీ రకరకాల కారణాలతో కుద‌ర‌లేదు. ఇపుడు మా సినిమా... ఎన్నిక‌లు మొత్తం ముగిసిన త‌ర్వాతే రిలీజ్ అవుతుంది. కాబట్టి పొలిటికల్ థీమ్ తో సినిమా వద్దనుకుంటున్నాం ,"  అని బోయ‌పాటి వివ‌ర‌ణ ఇచ్చారు. 

అలాగే సినిమాని ఫిబ్ర‌వ‌రిలో లాంఛ‌నంగా ప్రారంభించి మార్చి, ఏప్రిల్ నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ చేస్తార‌ని తెలిసిందే‌.  అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా గతంలో కాంబినేష‌న్‌లో వ‌చ్చిన "సింహా "త‌ర‌హాలో యాక్ష‌న్ పంథాలో సాగే మాస్ సినిమా ఉండ‌నుంది. ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై బాల‌య్యే ఈ సినిమాని నిర్మించనున్నారు. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో ఇంత‌కుముందు వ‌చ్చిన "సింహా", "లెజెండ్‌"...రెండూ సూప‌ర్ హిట్ట‌వటం ప్లస్ కానుంది.

click me!