బాక్స్ ఆఫీస్: ఫస్ట్ ప్లేస్ కంగనాదే!

Published : Feb 01, 2019, 04:37 PM IST
బాక్స్ ఆఫీస్: ఫస్ట్ ప్లేస్ కంగనాదే!

సారాంశం

  బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కంగనా రనౌత్ మరోసారి తన సత్తా చాటింది. రీసెంట్ గా విడుదలైన మణికర్ణిక సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ దెబ్బతో ఉమెన్ సెంట్రిక్ సినిమాల స్థాయి పెరిగిందని చెప్పవచ్చు.

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కంగనా రనౌత్ మరోసారి తన సత్తా చాటింది. రీసెంట్ గా విడుదలైన మణికర్ణిక సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ దెబ్బతో ఉమెన్ సెంట్రిక్ సినిమాల స్థాయి పెరిగిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో 42 కోట్ల వసూళ్లను అందుకొని టాప్ 1 లో నిలిచింది. 

ఇక మొదటి 7 రోజుల రికార్డ్ ను చూసుకుంటే మణికర్ణిక 61 కోట్లను టచ్ చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఆమె నటించిన తను వెడ్స్ మను(70కోట్లతో) మొదటి స్థానంలో ఉంది. వీరే ది వెడ్డింగ్ - రాజి అలాగే సిల్క్ స్మితా బయోపిక్ ద డర్టీ పిక్చర్ వంటి సినిమాలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ బాలీవుడ్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. 

ఫస్ట్ వీకెండ్ లో టాప్ లో నిలిచినా ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఇవే. మణికర్ణిక (42.55కోట్లు) -  తను వెడ్స్ మను(38.05కోట్లు) - వీరే ది వెడ్డింగ్(36.52కోట్లు) -రాజీ(32.94కోట్లు) - ద డర్టీ పిక్చర్(32.70కోట్లు) వంటి హీరోయిన్ డామినేషన్ సినిమాలు బాక్స్ వద్ద మంచి హిట్ గా నిలిచాయి. మణికర్ణిక వసూళ్లు చూస్తుంటే కంగనా కెరీర్ లో టాప్ గ్రాస్ అందుకునే విధంగా ఉందని టాక్ వస్తోంది

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు