ఇఫ్పటికే బోయపాటి చెప్పిన లైన్ కూడా అల్లు అర్జున్ బాగా నచ్చిందని. ఈ సినిమాని కూడా గీతా ఆర్ట్స్ నిర్మించనుందని మీడియాలో ప్రచారం మొదలైంది. బన్నీ, బోయపాటి కాంబో రిపీట్ అవుతుందని తెలియగానే టాలీవుడ్ లో మంచి బజ్ ఏర్పడింది.అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డైరక్ట్ చేయాలని ప్రతీ దర్సకుడుకి కోరిక ఉంటుంది. అయితే అది అంత తేలిగ్గా జరిగే పనికాదు. సాలిడ్ హిట్ చేతిలో పెట్టుకుని, బన్ని డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్దితి. ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ కరోనా బ్రేక్ లో ఉన్నారు. దాంతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం తన తదుపరి చిత్రాలు ఫైనలైజ్ చేసుకోవటం కోసం సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో బన్ని చుట్టూ ఇప్పటికే నలుగురు పైగా డైరక్టర్స్ ప్రదిక్షణాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీలైన్స్ చెప్పి ఆయనతో టచ్ లో ఉంటున్నారట. మొదట మురగదాస్ ..బన్నికి ఓ స్టోరీ లైన్ వినిపించారట. అయితే అది నచ్చలేదు వద్దన్నట్లు సమాచారం.
ఆ తర్వాత బోయపాటి శ్రీను, వేణు శ్రీరామ్ లు సైతం కథలు చెప్పి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఇఫ్పటికే బోయపాటి చెప్పిన లైన్ కూడా అల్లు అర్జున్ బాగా నచ్చిందని. ఈ సినిమాని కూడా గీతా ఆర్ట్స్ నిర్మించనుందని మీడియాలో ప్రచారం మొదలైంది. బన్నీ, బోయపాటి కాంబో రిపీట్ అవుతుందని తెలియగానే టాలీవుడ్ లో మంచి బజ్ ఏర్పడింది.అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.
అదే సమయంలో వేణు శ్రీరామ్ ఎప్పుడో ఐకాన్ సబ్జెక్టు చెప్పి ఓకే చేయించుకున్నారు. ప్రకటన కూడా వచ్చింది. దిల్ రాజు నిర్మాత. వకీల్ సాబ్ చిత్రం హిట్ అవ్వటంతో బన్ని మనస్సు ఆ సబ్జెక్టు మీదకు మళ్లిందంటున్నారు. దీంతో బోయపాటి లేదా వేణు శ్రీరామ్ ఈ ఇద్దరిలో ఒకరితో ఖచ్చితంగా అల్లు అర్జున్ కు సినిమా ఉంటుందంటున్నారు.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ఈ సినిమా తరవాత బన్నీ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు.