
ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సన్నివేశం అయినా హీరో రామ్ ఎనెర్జీ వేరే లెవల్ లో ఉంటుంది. అలాంటి హీరో పవర్ హౌస్ లాంటి మాస్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపితే సిల్వర్ స్క్రీన్ పై జాతర ఒక రేంజ్ లో ఉంటుందని ఆశించవచ్చు.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమే స్కంద. యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమే స్కంద. యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది.
భారీ అంచనాల నడుమ స్కంద చిత్రం సెప్టెంబర్ 15న రిలీజ్ కి రెడీ అవుతోంది. కానీ ఊహించని విధంగా మూడు వారాల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. శిల్ప కళావేదికలో నేడు ప్రేయర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఫ్యాన్స్ అంతా అఖండ 2 అని అరుస్తుండడంతో.. అఖండ 2 చేస్తున్నా కాస్త టైం ఇవ్వండి అంటూ హింట్ ఇచ్చారు. బోయపాటి మాట్లాడుతూ 15 ఏళ్లుగా బాలయ్యతో జర్నీ చేస్తున్నా. బాలయ్య ఒక శక్తి. ఆయనకి ఒక పదమైనా, పాత్ర అయినా లొంగుతుంది.. అందుకే జై బాలయ్య అని అన్నారు. బాలయ్యకి తనకి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణం ఒక్కటే కాదు ఆయన ఒక మాట చెబితే శుభం జరుగుతుంది.. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించాం అని అన్నారు.
ఇక స్కంద చిత్రం యాక్షన్ మూవీ, మాస్ మూవీ అని అంటున్నారు.. అదంతా కాదు ఇది పరిపూర్ణమైన ఫ్యామిలీ చిత్రం అని బోయపాటి అన్నారు. ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది అని అన్నారు. ఇక రామ్ పోతినేని ఒక తపన ఉన్న నటుడు. ఆ తపన వల్లే రామ్ ఈ స్థాయిలో ఉన్నాడు. ఇక శ్రీలీల గురించి చెప్పగానే గ్లామర్ అని అంటున్నారు.. కాదు ఆమె పరిపూర్ణమైన ఆర్టిస్ట్. ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావ్ అని అడుగుతాం. కానీ శ్రీలీల కనిపిస్తే ఏ హీరోతో చెయ్యట్లేదు అని అడగాల్సి వస్తోంది అంటూ సెటైర్ వేశారు. ఇలాగే ముందుకెళ్లు కాకపోతే మరీ ఎక్కువగా పరిగెడితే గ్లామర్ దెబ్బతింటుంది జాగ్రత్తగా వెళ్లు అంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. ఇక సయీ మంజ్రేకర్ గంగా జలం లాంటి స్వచ్ఛమైన అమ్మాయి అంటూ బోయపాటి కితాబిచ్చారు.