మాట కోసం పాకెట్ మనీకే భారీ సినిమా చేసిచ్చిన బోయపాటి

Published : Aug 10, 2017, 09:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మాట కోసం పాకెట్ మనీకే భారీ సినిమా చేసిచ్చిన బోయపాటి

సారాంశం

ఇచ్చిన మాట కోసం పాకెట్ మనీకే భారీ సినిమా చేసిచ్చిన బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో జయజానకినాయక ఇచ్చిన మాట కోసం పాకెట్ మనీ అంత పారితోషికంతో మూవీ చేశానన్న బోయపాటి

టాప్ డైరెక్టర్స్ లిస్టులో కొనసాగుతూ.. కమర్షియల్ సినిమాలకు చిరునామాగా.. మారిన బోయపాటి శ్రీను తాను దర్శకత్వం వహించే సినిమాలకు 10 కోట్ల నుండి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు అనే వార్తలు ఉన్నాయి. దీనితో ఈ డైరెక్టర్ ను పెట్టి సినిమా తీయాలి అంటే కనీసం 50 కోట్ల బడ్జెట్ కావాలి అన్న కామెంట్స్ ఉన్నాయి.

 

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా చేయడం ఆశ్చర్యం అయితే తాను దర్శకత్వం వహించిన ‘జయ జానకి నాయక’ సినిమాకు తాను తీసుకున్న పారితోషికం తన పోకెట్ మనీతో సమానం అని బోయపాటి కామెంట్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. రేపు విడుదల కాబోతున్న ఈసినిమాను ప్రమోట్ చేస్తూ బోయపాటి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసాడు.

 

తాను ఈ సినిమాను కేవలం మాట కోసమే తప్ప పారితోషకానికి ఆశపడి చేయలేదు అని అంటూ ‘‘మన రక్తానికి ఓ రంగు మన మాటకు ఓ విలువ మనకు ఓ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. ‘సరైనోడు’ తర్వాత నాకు చాలా పెద్ద ఛాన్సులొచ్చాయి. కానీ ఎప్పుడో సాయి శ్రీనివాస్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికే జయ జానకి నాయక చేశాను’ అంటూ షాకింగ్ కామెంట్ చేసాడు బోయపాటి.

 

అయితే మొక్కుబడి కోసం కాకుండా ఈసినిమాను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అన్న కసితో చేసాను అని అంటున్నాడు బోయపాటి. తనకు డబ్బుకంటే మాట ముఖ్యం అని అంటూ తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నాడు ఈ టాప్ డైరెక్టర్.

 

అయితే బోయపాటి మాటలు ఇలా ఉంటె దాదాపు 30 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లు బాగుపడాలి అంటే కనీసం 40 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ఈసినిమాకు రావాలి అని అంటున్నారు. అయితే కేవలం బోయపాటి దర్శకత్వాన్ని నమ్ముకుని సామాన్య ప్రేక్షకులు యంగ్ హీరో బెల్లం కొండ సినిమాకు ఈ రేంజ్ హిట్ ఇస్తారా ? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి