బోయపాటి వారి సెల్ఫ్ ప్రమోషన్.. జయజనాకినాయక ఆడియో వేడుకలో షాకింగ్

Published : Aug 01, 2017, 01:59 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
బోయపాటి వారి సెల్ఫ్ ప్రమోషన్.. జయజనాకినాయక ఆడియో వేడుకలో షాకింగ్

సారాంశం

గ్రాండ్ గా జయజానకి నాయక ఆడియో వేడుక వేడుకలో ఆ నలుగురినీ, ఈ నలుగురినీ తెగ పొగిడిన బోయపాటి పనిలోపనిగా తన గురించి నాలుగు మాటలు హైప్ చేసుకున్న బోయపాటి

జయజానకి నాయక ఆడియో వేడుక సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి నాలుగు అద్భుతాలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. నిన్నజరిగిన ‘జయ జానకీ నాయక’ ఆడియోఫంక్షన్ లో బోయపాటి మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీని కవర్ చేస్తూ ప్రసంగించాడు. ఈ సందర్భంగా సాగిన బోయపాటి ప్రసంగం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

 

‘ఈ సంవ‌త్స‌రం తెలుగు ప‌రిశ్రమలో నాలుగు అద్భుతాలు జ‌రిగాయి, మొద‌టిది కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం, రెండోవది ‘బాహుబ‌లి 2’ విడుదలై భారీ విజయం సాధించి దేశ విదేశాల్లో ఖ్యాతిని పొందడం. మూడవది ద‌క్షిణ భార‌తదేశ చ‌రిత్రలో ఒకే థియేట‌ర్‌లో 1084 రోజులు ఆడిన సినిమాగా ‘లెజండ్' రికార్డ్ క్రియేట్ చేయడం, నాలుగోది వ‌స్తారా రారా అని మీమాంస‌లో ఉన్న‌ప్పుడు చిరంజీవిగారు ‘ఖైదీ నంబ‌ర్ 150’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి 150 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను వసూలు చేయడం’  అంటూ అందర్నీ ఆకాశంలోకి ఎత్తేసి తాను అందరి వాడిని అని నిరూపించుకున్నాడు బోయపాటి.

 

ఇక గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి దాసరిగారు, రాఘ‌వేంద్ర‌రావుగారు, కోదండ‌రామిరెడ్డిగారు, బి.గోపాల్‌, కోడిరామ‌క‌ష్ణ‌గారు, సింగీతం శ్రీనివాస‌రావుగారు లాంటి గొప్పవ్యక్తులు ఉంటే ఇప్పుడు ఆజాబితాలోకి రాజమౌళి చేరిపోవడం టాలీవుడ్ ఇండస్ట్రీ అదృష్టం అంటూ బోయపాటి రాజమౌళి పై కూడ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇదే సందర్భంలో వినాయక్, పూరి, సురేంర‌ద్ రెడ్డి, సుకుమార్‌, తేజ‌, కృష్ణవంశీ వంటి గొప్ప ద‌ర్శ‌కులతో పాటు మీముందు మాట్లాడుతున్న బోయపాటి కూడా ఉన్నాడు అంటూ సెల్ఫ్ ప్రమోషన్ కూడా ఈ ఫంక్షన్ కు ఏఅ మాత్రం తగ్గకుండా కానిచ్చేశాడు బోయపాటి. ఆఢియో ఈవెంట్ కు వచ్చిన చాలామంది బోయపాటి వ్యక్తిగత ప్రమోషన్ గురించి తెగ గుసగుసలాడినట్లు టాక్.

 

ఇక చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌, బ‌న్ని, చ‌ర‌ణ్, ప్రభాస్ లతో పాటు యంగ్ హీరోలు నాని, శ‌ర్వానంద్, నిఖిల్ వంటి వారున్నారు అంటూ బోయపాటి అందరి హీరోలకు ఒకేసారి ప్రశంసలు కురిపించే కార్యక్రమాన్ని చేపట్టాడు. ప్రస్తుతం బోయపాటి చిరంజీవితో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్న నేపధ్యంలో మెగాకుటుంబాన్ని పొగిడే కార్యక్రమం చేస్తూ మధ్యలో అందరి హీరోల ప్రస్తావన కూడ తీసుకువచ్చాడు. 

 

‘జయ జానకీ నాయక’ టైటిల్ చూసి బోయపాటి మారిపోయాడా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేసినా నిన్నవిడుదలైన ఈసినిమా ధియేట్రికల్ ట్రైలర్ ను చూసినవారు బోయపాటి తన మాస్ మసాలాను ఏమాత్రం వదులుకోలేదు అన్నసంకేతాలు ఇచ్చాడు. అయితే భారీబడ్జెట్ తో తీసిన ఈసినిమాను ఏమాత్రం తగ్గకుండా రానా,నితిన్ లతో పోటీ పడుతూ వచ్చేవారం విడుదల చేయడం మాత్రం బోయపాటిది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేలా వుంది..

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?