అఖండ సూపర్ సక్సెస్ లో ఉన్న బోయపాటి నెక్ట్స్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడు అనుకుంటే పవన్ కళ్యాన్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి బన్నీతో సినిమా ఏమైనట్టు.
బోయాపాటి అంటేనే యాక్షన్.. ఊరమాస్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా డైలాగ్స్.. యాక్షన్స్ సీక్వెన్స్ లు తీయడంలో దిట్ట బోయాపాటి. ఆయన సినిమాల్లో యాక్షన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటందో.. ఫ్యామిలీ సెంటిమెంట్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు భారీ డిజాస్టర్స్ ఫేస్ చేసినా.. తన మార్క్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు బోయపాటి. హీరోలకు తన మార్క్ యాక్షన్ తో ఎక్స్ ట్రా పవర్ ఆడ్ చేసి సక్సెస్ పుల్ సినిమాలు అందిస్తున్న బోయపాటి.. పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్నట్టు క్రేజీ రూమర్ బయటకు వచ్చింది.
బాలయ్య బాబుతో అఖండ సినిమా చేసి.. మెమోరబుల్ హిట్ కొట్టాడు డైరెక్టర్ బోయపాటి. ఆతరువాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలని కథ కూడా రెడీ చేసకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ గట్టిగానడిచింది. వీరిద్దరి ప్రాజక్ట్ దాదాపు కన్ ఫార్మ్అయినట్టే అనుకున్నారంతా. చిన్న చిన్న హింట్స్ కూడా ఇచ్చారు వీరి సినిమా గురించి. అయితే ఇప్పుడు ఆ ప్రాజక్ట్ పెండింగ్ ల్ పడిపోయినట్టు తెలుస్తోంది.
సుకుమార్ తో పుష్ప మూవీ చేసిన బన్నీ.. పార్ట్ వన్ ను రీసెంట్ గా రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ కొట్టాడు. కలెక్షన్ల వరద పారించడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు బన్నీ. అయితే పుష్ప పార్ట్ 1ను రిలీజ్ చేసిన తరువాత పుష్ప పార్ట్ 2కి గ్యాప్ ఇచ్చి.. బోయపాటి సినిమా కంప్లీట్ చేయాలి అనుకున్నాడు అల్లు అర్జున్. కాని ఇఫ్పుడు ఈ ఊపులోనే పార్ట్ 2 కూడా పూర్తి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడట. దాంతో బోయపాటికి సినిమాను హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. దాంతో బోయపాటి తరువాతి సినిమాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
Also Read : Janhvi Kapoor: ఐలాండ్ లో అందాలు ఆరబోస్తున్న జాన్వీ కపూర్.. సెగలు పుట్టిస్తుంది
అల్లు అర్జున్ తో సినిమా కు చాలా టైమ్ ఉంది. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ లో బోయపాటి పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ కథను రెడీ చేసుకున్నాడట. అది ఆయనకు విపించు టైమ్ కోసం చూస్తున్నాడట. ఒక వేళ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కథను ఇంకా ముస్తాబు చేసే ఆలోచనలో ఉన్నాడట బోయపాటి కాని పవర్ స్టార్ భీమ్లా నాయక్ మూవ కంప్లీట్ చేసి.. క్రిష్ తో హరిహర వీర మల్లు సెట్ లో జాయిన్ అవుతున్నాడు. ఆతరువాత హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ చేయబోతున్నాడు. వెంటనే సురేందర్ రెడ్డి కథతో రెడీగా ఉన్నాడు. మరో వైపు సముద్ర ఖని కూడా పవర్ స్టార్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. మరి బోయపాటి సినిమా పవర్ స్టార్ తో వర్కౌట్ అవుతుందా..? బోయపాటి నెక్ట్స్ స్టెప్ ఏంటీ అనేది తెలియాలి అంటే.. వేచి చూడాల్సిందే.
Also Read : Vijay Devarakonda: ఆట షురూ చేసిన లైగర్.. ఇక నుంచి జాతరే