Vijay Devarakonda: ఆట షురూ చేసిన లైగర్.. ఇక నుంచి జాతరే

చాలా కాలం సైలెంట్ గా.. ఉన్న లైగర్ టీమ్ ఒక్క సారిగా హడావిడి స్టార్ట్ చేసింది. అటు షూటింగ్స్ కంప్లీట్ చేస్తూనే ఇటు ప్రమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టారు. వరుస అప్ డేట్స్ తో హడావిడి చేస్తున్నారు.


చాలా కాలం సైలెంట్ గా.. ఉన్న లైగర్ టీమ్ ఒక్క సారిగా హడావిడి స్టార్ట్ చేసింది. అటు షూటింగ్స్ కంప్లీట్ చేస్తూనే ఇటు ప్రమోషన్స్ మీద కూడా దృష్టి పెట్టారు. వరుస అప్ డేట్స్ తో హడావిడి చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమా లైగర్(Liger). పూరీ జగననాథ్ డైరెక్షన్ లో.. పూరీ కంటెంట్స్ తో కలిసి బాలీవుడ్స స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. హాలీవుడ్ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్(Mike Tyson) ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు.

Latest Videos

 

కరోనా కారణంగా చాలా కాలం షూటింగ్ పోస్ట్ పోన్ చేసిన మూవీ టీమ్.. ఈమధ్యే యాక్టీవ్ అయ్యారు. ముంబయ్ లో మేజర్ షూటింగ్ జరగడం.. అక్కడే ఎక్కువ కరోనా కేసులు ఉండటంతో లైగర్ టీమ్ చాలా కాలం కామ్ గా ఉన్నారు. ఇక రీసెంట్ గా అమెరికా షెడ్యూల్ తో ఫుల్ యాక్టీవ్ అయిపోయిన లైగర్(Liger) టీమ్.. లాస్ ఏంజల్స్ లో మైక్ టైసన్ కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ సీన్స్.. సాంగ్స్ ను అక్కడే కంప్లీట్ చేసుకుని వచ్చారు.

 

ఇంకా కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా..ప్రమోషన్స్ ను స్పీడ్అప్ చేశారు టీమ్. రీసెంట్ గా లైగర్(Liger)సినిమాను పిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు టీమ్. ఇక రేపు (31 డిసెంబర్ ) లైగర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాబోతోంది. ఇక జనవరి నుంచి రిలీజ్ డేట్ వరకూ వరుసగా  ప్రమోషన్ వీడియోస్ తో.. ప్రమోషనలం ఈవెంట్స్ తో హడావిడి చేయాలని ప్లాన్ చేసుకున్నారట టీమ్. ఇప్పటికే రోజూ ఏదో ఓక పోస్టర్ ను రిలీజ్ చేస్తూనే ఉన్నారు లైగర్ టీమ్.

Also Read : Mahesh Babu: కోలుకున్న మహేష్ బాబు .. షూటింగ్ కు సై అన్న సూపర్ స్టార్..?

ఇక జనవరి సెకండ్ వీక్ వరకూ టీజర్ ట్రీట్ ఇచ్చి.. జనవరి ఎండ్ వరకూ థియేట్రికల్ ట్రైలర్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ మధ్యలో ఫస్ట్ సింగిల్ కూడా ప్లాన్ చేసుస్తున్నారు లైగర్(Liger) టీమ్. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్తుండటంతో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అటు పూరీ జగన్నాథ్ కు కూడా ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో.. పూరీ కూడా సక్సెస్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. విజయ్ దేవరకొండ ఇమేజ్ తో పాటు.. పూరీ సీనియారిటీ కలపుకుని లైగర్ ను తెరకెక్కిస్తున్నారు. మరి విజయ్ ఈమూవీతో పాన్ ఇండియాను మెప్పించగలడా చూడాలి.  

 Also Read : RRR Movie:ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్స్ కి సర్వం సిద్ధం... అవన్నీ పుకార్లే!

click me!