Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

Published : Dec 30, 2021, 12:58 PM IST
Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

సారాంశం

శ్యామ్ సింగరాయ్ ఓటీటీ విడుదలపై ఊహాగానాలు మొదలయ్యాయి. సదరు కథనాల ప్రకారం జనవరిలో  శ్యామ్ సింగరాయ్ ఓటిటిలో స్ట్రీమ్ కానుందట.

హీరో నాని (Nani)శ్యామ్ సింగరాయ్ మూవీతో కమర్షియల్ హిట్ కొట్టారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ విభిన్న కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. కాగా శ్యామ్ సింగరాయ్ ఓటీటీ విడుదలపై ఊహాగానాలు మొదలయ్యాయి. సదరు కథనాల ప్రకారం జనవరిలో  శ్యామ్ సింగరాయ్ ఓటిటిలో స్ట్రీమ్ కానుందట. 

శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy)విడుదలకు ముందు నాని మీడియా ఇంటరాక్షన్ లో ఓ కామెంట్ చేశారు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ శ్యామ్ సింగరాయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇవ్వజూపిందట. అయితే ప్రేక్షకులకు థియేటర్స్ లో బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆఫర్ ని వదులుకొని థియేటర్స్ లో విడుదల చేశామన్నారు. కాగా శ్యామ్ సింగరాయ్ ఓటీటీ హక్కుల కోసం ప్రయత్నించింది నెట్ఫ్లిక్స్ అని సమాచారం. అలాగే థియేటర్ రిలీజ్ అనంతరం కూడా శ్యామ్ సింగరాయ్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు వినికిడి. 

సాధారణంగా థియేటర్ విడుదల తర్వాత నాలుగు వారాలకు ఓటీటీ సంస్థలు చిత్రాలను స్ట్రీమ్ చేస్తాయి. ఆ లెక్కన జనవరి చివర్లో శ్యామ్ సింగరాయ్ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుందని సమాచారం. కొన్ని సార్లు నాలుగు వారాల కంటే ముందే స్ట్రీమ్ చేసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో సంక్రాంతి కానుకగా కూడా ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం కలదు. మరి దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

శ్యామ్ సింగరాయ్ మూవీలో నాని డ్యూయల్ రోల్ చేశారు. ముఖ్యంగా కలకత్తా పీరియాడిక్ ఎపిసోడ్స్ లో శ్యామ్ సింగరాయ్ గా ఆకట్టుకున్నారు. సాయి పల్లవి మరోసారి తానేమిటో ఈ చిత్రం ద్వారా నిరూపించారు. సాంకేతిక నిపుణులతో పాటు నటులకు ప్రసంశలు దక్కుతున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్యామ్ సింగరాయ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. కృతి శెట్టి(Krithi shetty), మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటించారు. 

కాగా శ్యామ్ సింగరాయ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేరుగా చూడాలని సాయి పల్లవి (Sai Pallavi)ఆశపడ్డారు. దీని కోసం ఆమె చాలా పెద్ద సాహసం చేశారు. హైదరాబాద్ శ్రీరాములు థియేటర్స్ కి ఆమె మారువేషంలో వెళ్లారు. బురఖా ధరించిన సాయి పల్లవి శ్రీరాములు థియేటర్ లో పూర్తి మూవీ వీక్షించారు. 

Also read Sai Pallvi:మారువేషంలో సాయి పల్లవి హల్చల్... సెక్యూరిటీ కూడా లేకుండా సాహసానికి ఒడిగట్టిన ఫిదా బ్యూటీ
బురఖా లో ఉన్న సాయి పల్లవిని ఎవరూ గుర్తించలేదు. హాలు నుండి బయటికి వస్తుంటే ఓ రిపోర్టర్ ఆమెను సినిమా ఎలా ఉందని స్వయంగా అడిగారు. అయితే సాయి పల్లవి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. హాలు నుండి బయటికి వచ్చాక కారులో ఎక్కే ముందు సాయి పల్లవి తన ఐడెంటిటీ రివీల్ చేశారు. బురఖాలో ఉంది సాయి పల్లవి అని అప్పుడు అక్కడ ఉన్న ప్రేక్షకులు తెలుసుకున్నారు. 

Also read నీ పేరేంటి?.. వైసీపీ మంత్రిపై నాని సెటైర్.. నాని గారూ అసలు తగ్గడం లేదుగా!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా
ఎన్టీఆర్ 'సింహాద్రి'ని వద్దనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.? అస్సలు ఊహించలేరు