బోయపాటికి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందంటున్న జె క్యూబ్ ఫస్ట్ లుక్

Published : Jul 01, 2017, 08:54 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బోయపాటికి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందంటున్న జె క్యూబ్ ఫస్ట్ లుక్

సారాంశం

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయజానకి నాయక బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అందర్నీ ఆశ్యర్య పరిచిన టీమ్

దర్శకుడు బోయపాటి సిన్మాలంటే పంచ్ డైలాగులు, హై రేంజ్ యాక్షన్, ఫైట్స్, డైలాగ్ వార్స్. బోయపాటి అనగానే మనకు గుర్తొచ్చే పంచ్‌ డైలాగులు మరిచిపోయే రేంజ్ లో ఆయన తన తాజా సినిమా చూపిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘జయ జానకి నాయక’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఈ శుక్రవారమే విడుదల చేశారు.

రోడ్డు పక్కన పార్క్‌ చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌... దాన్ని అనుకుని హీరోయిన్‌ రకుల్‌... రోడ్డుపై కూర్చున్న హీరో... బోయపాటి దర్శకత్వంలో రెండోవైపును చూడండి! ఆయన అభిమానులకు ఈ లుక్‌ కాస్త సర్‌ప్రైజ్‌ ఇస్తే, ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకుంది. ఈ సిన్మాలో బోయపాటి మార్క్‌ యాక్షన్‌ కూడా ఉందట! ప్రస్తుతానికి దాన్ని దాచేశారు. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

మొత్తానికి బోయపాటి రెండోవైపు కూడా చూపించేందుకు సిద్ధమయ్యాడన్నమాట.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?