హీట్ పెంచి కూల్ గా బరిలోకి పవన్.. ముహూర్తం ఫిక్స్!

pratap reddy   | Asianet News
Published : Sep 27, 2021, 03:53 PM IST
హీట్ పెంచి కూల్ గా బరిలోకి పవన్.. ముహూర్తం ఫిక్స్!

సారాంశం

రిపబ్లిక్ (Republic) ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సినీ రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. 

రిపబ్లిక్ (Republic) ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సినీ రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. చిత్ర పరిశ్రమ నుంచి కొద్దిమంది మాత్రమే పవన్ కళ్యాణ్ కి బహిరంగంగా మద్దతు తెలిపారు. మిగిలిన వారంతా మౌనం వహిస్తున్నారు. 

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం గురించి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా సందేశం కూడా ఉండబోతోందని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. ఇక తాజా సమాచారం మేరకు ఈ చిత్రం విజయదశమి సందర్భంగా అక్టోబర్ 15న గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే షూటింగ్ కూడా ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా పూజా హెగ్డే నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అక్టోబర్ 15న క్లారిటీ రానుంది. 

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఇదివరకే గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. ఆ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దీనితో భవదీయుడు భగత్ సింగ్ పై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..