అమితాబ్, ధర్మేంద్ర ఇంటికి బాంబు బెదిరింపు.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల బద్రత పెంపు

Published : Mar 01, 2023, 10:34 PM IST
అమితాబ్, ధర్మేంద్ర ఇంటికి బాంబు బెదిరింపు.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల బద్రత పెంపు

సారాంశం

 బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్, ధర్మేంద్ర లతో పాటు వ్యాపార దిగ్గజం అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. దాంతో పోలీస్ శాఖ అప్రమంత్తం అయ్యింది. ఇంతకీ అసలు వివరాల్లోకి వెళితే..


బాలీవుడ్ సెలబ్రిటీలకు.. వ్యాపార దిగ్గజాలకు.. పొలిటికల్ లీడర్స్ కు బాంబు బెదిరిపులు కామన్ గా మారింది. ఈ మధ్య ఇలాంటి బెదిరింపు కాల్స్ స్టార్స్ కు ఎక్కువగా వస్తున్నాయి. అందులో ఎక్కువగా ఫేక్ కాల్స్ గా గుర్తిస్తున్నారు. అయితే ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియనట్టు.. నిజంగా ఎవరైనా బాంబ్ పెట్టి ఉంటే... అందుకే పోలీస్ శాఖ ఉరకులు పరుగులు పెట్టి.. సెలబ్రిటీలకు రక్షణ పెంచుతూ వస్తున్నారు. ఈక్రమంలో రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. సీనియర్ హీరో ధర్మేంద్రల ఇళ్లకు బాంబ్ బెదిరింపులు ముంబయ్ లో కలకలం రేపాయి. 

బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతంలో వీరిద్దరూ కలిసిన నటించిన మంగళవారం ఉదయం నాగ్ పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేసి ఇద్దరు హీరోల ఇళ్లకు బాంబు పెట్టి పేల్చేస్తామని బెదించాడు. దాంతో ముంబయ్ పోలీసులు అలర్ట్ అయ్యారు.  వెంటనే సెలబ్రిటీ ఇళ్ళు .. వాటి పరిసర  ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తో క్షున్నంగా పరిశీలించారు. అయితే వారికి ఎటువంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

ఇక వచ్చిన కాల్ ఫేక్ కాల్ అయి ఉంటుందని అంటున్నారు పోలీసులు. ఎవరో ఆకతాయిలు చేసి ఉంటారు అన్న అనుమానాలు వ్యాక్తం చేస్తున్నారు... అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే  ముంబాయిలో ఉగ్రవాదులు చేరారు అన్న సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధాలు, బాంబులతో దాడి చేసే అవకాశం కూడా ఉంది అని టాక్. దాంతో సెలబ్రిటీల ఇళ్లకు సెక్యూరిటీ పెంచుతున్నట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే జుహు, విల్లే పార్లే లతో పాటు స్టార్ హీరోలు, ప్రముఖ వ్యాపారు నివాసాల వద్ద మహారాష్ట్రా సర్కారు  గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో  అమితాబచ్చన్ ప్రతీక్షాలో ఉంటున్నారు. ఇక యాక్షన్, రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర జుహు లో ఉంటున్నారు. వీరిద్దరు కలిసి సందడిచేసిన సినిమా షోలే.. పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరు హీరోల ఇళ్లకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా