తండ్రి కాబోతున్న బాలీవుడ్ యంగ్ హీరో..? హింట్ ఇచ్చిన సల్మాన్ ఖాన్

Published : Nov 14, 2022, 08:27 AM IST
తండ్రి కాబోతున్న బాలీవుడ్ యంగ్ హీరో..? హింట్ ఇచ్చిన  సల్మాన్ ఖాన్

సారాంశం

బాలీవుడ్ లో ఆ మధ్య వరుసగా పెళ్ళిళ్లు అయినట్టే.. ఈమధ్య వరుసగా పేరెంట్స్ అవుతున్నారు స్టార్లు. ఇక బాలీవుడ్ లో మరో యంగ్ స్టార్ తండ్రికాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో హింట్ ఇచ్చాడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్.   

బాలీవుడ్ లో ఆ మధ్య వరుసగా పెళ్ళిళ్లు అయినట్టే.. ఈమధ్య వరుసగా పేరెంట్స్ అవుతున్నారు స్టార్లు. ఇక బాలీవుడ్ లో మరో యంగ్ స్టార్ తండ్రికాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో హింట్ ఇచ్చాడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. 

బాలీవుడ్ లో వరుసగా స్టార్లు తల్లి తండ్రులు అవుతున్నారు. రీసెంట్ గా రణ్ బీర్- ఆలియా  తో పాటు బిపాసా బసు కూడా బిడ్డకు జన్మనివ్వగా.. ప్రస్తుతం యంగ్ హీరో వరుణ్ ధావన్  తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం డైరెక్ట్ గా అనౌన్స్ చేయకపోయినా.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. రీసెంట్ గా వరుణ్ ధావన్ తన సినిమా ప్రమోషన్ కోసం హిందీ బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళగా.. ఈ విషయం బయట పడింది. 

రీసెంట్ గా భేదియా సినిమా ప్రమోషన్స్ కోసం హిందీ బిగ్ బాస్ కు వెళ్ళాడు వరుణ్ ధావన్. తనతో పాటు తన హీరోయిన్ కృతి సనన్ ను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లతో సదరా సరదా గేమ్స్ ఆడించాడు సల్లు భాయ్. అందులో భాగంగా ఓ బొమ్మను వరుణ్ చేతిలో పెట్టి ఇన్ డైరెక్ట్ గా కొన్నివాఖ్యలు చేశారు సల్మాన్ ఖాన్. బొమ్మను చేతిలో పెట్టిన సల్మాన్.. వరుణ్ తో ఈ బోమ్మ నీ పిల్లాడికోసమే.. అంటూ  చెప్పాడు. దాంతో సిగ్గుపడుతూ.. వరుణ్ ధావన్ నాకు ఇంకా ఎవరూ పుట్టలేదు కదా అన్నాడు. 

ఇక ఈ మాటలకు సల్మాన్ జవాబిస్తూ..  ఈ బొమ్మను ఇంటికి తీసుకెళ్లు.. త్వరలో నీ ఇంటికి ఓ బాబో.. పాపో వస్తుంది అని సల్మాన్ సరదాగా వ్యాఖ్యానించాడు. దాంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. యంగ్ హీరో ఇంట త్వరలో పిల్లలు సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది అంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ ఈ మధ్య తన బిగ్ బాస్ షోలో.. ఇలా ఇన్ డైరెక్ట్ హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆమధ్య తన షోకి వచ్చిన సిద్థార్థ్ తో కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు అంటూ హింట్ ఇచ్చాడు. వారు వచ్చే జనవరిలో పెళ్లి చేసుకోబో్తున్నట్టు తెలుస్తోంది. 

ఇలా బాలీవుడ్ స్టార్స్ కు సంబంధించిన విషయాలను తన షో ద్వారా అనౌన్స్ చేస్తూ.. హడావిడి చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. వరుణ్ విషయంలో కూడా సల్మాన్ ఖాన్ చెప్పింది జోక్ కాదని.. నిజంగా వరుణ్ తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ యంగ్ హీరో నటించిన బేదియా మూవీ నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర