
యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. అర్జున్ సురవరం తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తీ చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాల, ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో స్పై ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
చాలా కాలంగా...ఈసినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు అనుకున్నటైమ్ లో .. లాస్ట్ మన్త్ ఏప్రిల్‌లో నిఖిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈడీ ఎంటర్టైన్ మెంట్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చకచకా ఈ సినిమా షూటింగును జరుపుకుంటోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ విటేకర్ పనిచేస్తుండటం విశేషం. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే వచ్చే దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మేకర్స్.
నిఖిల్ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇక ఈమూవీని దసరాకు రిలీజ్ పక్కా చేస్తే.. పెద్ద సినిమాలకు ఇది పోటీ అనాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న చాలా సినిమాలు దసరాను టార్గెట్ చేసుకుని ఉన్నాయి. తక్కువలో తక్కువ ఐదారు పెద్ద సినిమాలన్నా.. దసరా బరిలో ఉండే అవకావం ఉంది. మరి నిఖిల్ నిజంగానే దసరాకు రెడీ అవుతున్నాడా అనేది తెలియల్సి ఉంది.
తాజాగా ఈమూవీ నుంచి మరో బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు. స్పై సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను జూన్ 6 ఉదయం 11.11 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకు తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం నిఖిల్ సుకుమార్ నిర్మిస్తున్న 18పేజిస్, చందు ముండేటి కార్తికేయ-2 లు షూటింగ్‌లలో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు సుధీర్ వర్మతో తన మూడవ సినిమాను చేయనున్నాడు.