బాలీవుడ్ స్టార్ హీరోతో నితిన్ గొడవ.. ఏకంగా ఆయనతోనే పెట్టుకుంటున్నాడుగా 

By tirumala AN  |  First Published Feb 12, 2024, 11:04 AM IST

యంగ్ హీరో నితిన్ కి ఈ ఏడాది ఎలాగైనా ఒక హిట్ కావాలి. భీష్మ తర్వాత నితిన్ కి సరైన హిట్ పడి చాలా కాలమే అవుతోంది. ఇప్పుడు హిట్ కోసం మరోసారి నితిన్ భీష్మ డైరెక్టర్ నే నమ్ముకున్నాడు.


యంగ్ హీరో నితిన్ కి ఈ ఏడాది ఎలాగైనా ఒక హిట్ కావాలి. భీష్మ తర్వాత నితిన్ కి సరైన హిట్ పడి చాలా కాలమే అవుతోంది. ఇప్పుడు హిట్ కోసం మరోసారి నితిన్ భీష్మ డైరెక్టర్ నే నమ్ముకున్నాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో రెండో చిత్రం తెరకెక్కుతోంది. 

ఈ చిత్ర టైటిల్ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. బాగా పాపులర్ అయిన రాబిన్ హుడ్ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నితిన్, వెంకీ కుడుములది ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కాబట్టి రాబిన్ హుడ్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ కూడా అదిరిపోయింది. వెంకీ కుడుములు తన స్టైల్ లో ఫన్ అండ్ యాక్షన్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

టీజర్ లో నితిన్ పాత్ర ఏంటో క్లారిటీ ఇచ్చేశారు. రాబరీ చేసే యువకుడిగా నితిన్ కనిపిస్తున్నాడు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ ఏ చిత్రంలో విలన్ అని కూడా అంటున్నారు. 

కెజిఎఫ్ 2, లియో చిత్రాలతో సంజయ్ దత్ సౌత్ లో సంచలనంగా మారారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సంజయ్ డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో ఆల్రెడీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సంజయ్ దత్ రోల్ గురించి రాబిన్ హుడ్ టీం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. 

Also Read: Actor Nandu:వెక్కి వెక్కి ఏడ్చిన నందు, ఆ 12 రోజులు నరకం చూపించారు.. గుండెల్ని పిండేసేలా ఆవేదన

ఇది కనుక నిజమైతే నితిన్ చిత్రానికి ఎక్స్ట్రా మైలేజి దక్కినట్లే అని చెప్పొచ్చు.మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరోయిన్ గా మొదట రష్మికని అనుకున్నప్పటికీ ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 

click me!