Hrithik Roshan:మిస్టీరియస్ యంగ్ లేడీతో హృతిక్ రోషన్ ప్రేమాయణం? వీధుల్లో పబ్లిక్ గా చక్కర్లు కొడుతున్న జంట!

Published : Jan 31, 2022, 08:04 AM IST
Hrithik Roshan:మిస్టీరియస్ యంగ్ లేడీతో హృతిక్ రోషన్ ప్రేమాయణం? వీధుల్లో పబ్లిక్ గా చక్కర్లు కొడుతున్న జంట!

సారాంశం

బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)వయసు 48. భార్యతో విడాకులు తీసుకొని సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్న హృతిక్ ప్రేమలో పడ్డారనేది మీడియా వర్గాల్లో హాట్ టాపిక్. హృతిక్ రోషన్ సదరు లేడీతో తరచుగా బయట కనిపిస్తుండగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. 


హృతిక్ రోషన్ భార్య సుసానే ఖాన్ తో విడిపోయిన విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న ఈ జంట అధికారికంగా వేరయ్యారు. సుసానే-హృతిక్ రోషన్ లకు ఇద్దరు కుమారులు. వారి సంరక్షణ బాధ్యత ఇద్దరూ చూసుకుంటున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇద్దరు పిల్లలతో కలిసి విందులు, విహారాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హృతిక్ వైవాహిక జీవితం అలా ముగిసింది. అయితే ఆయన కొత్తగా ఓ యంగ్ లేడీతో పబ్లిక్ లో షికార్లు చేయడం సంచలనంగా మారింది. 

ఈ వీకెండ్ సదరు యంగ్ లేడీతో సెలబ్రేట్ చేసుకున్నాడు హృతిక్. వీరిద్దరూ ఓ రెస్టారెంట్ నుండి బయటికి వస్తూ మీడియా కంటపడ్డారు. ఇక సదరు మిస్టీరియస్ లేడీ ఎవరని ఎంక్వైరీ చేయగా.. నటి, మ్యూజీషియన్ సబ ఆజాద్ (Saba Azad) అని తెలిసింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో తరచుగా కనిపిస్తున్న ఈ యంగ్ లేడీ ఆమెనే. ఇక హృతిక్ తో ఆమెకున్న రిలేషన్ ఏమిటో తెలుకోవడానికి ఓ మీడియా సంస్థ ఆమెను స్వయంగా సంప్రదించగా.. అస్పష్టమైన సమాధానం చెప్పి తప్పుకున్నారట.
 
హృతిక్ తో సబ ఆజాద్ ఎఫైర్ దాదాపు ఖాయమే అని తెలుస్తుండగా... త్వరలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం హృతిక్ 'విక్రమ్ వేద' (Vikram Veda)మూవీలో నటిస్తున్నారు. బర్త్ డే సందర్భంగా హృతిక్ రోషన్ లుక్ విడుదల చేశారు. గాయత్రీ-పుష్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ వేద తమిళ్ హిట్ చిత్రానికి రీమేకన్న విషయం తెలిసిందే. హృతిక్ రౌడీ పాత్ర చేస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ పోలీసు పాత్ర చేస్తున్నారు. 

వార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హృతిక్ నుండి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి.  చాలా కాలం తర్వాత హృతిక్ రోషన్ వార్ మూవీతో కమర్షియల్ హిట్ అందుకున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వార్ తెరకెక్కింది. వార్ మూవీలో టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటించిన విషయం తెలిసిందే. వార్ 2019 బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం