Balakrishna: బాలయ్య టాక్ షో సక్సెస్ లో చిన్న కూతురు తేజస్విని పాత్ర... అసలు విషయం లీక్ చేసిన డైరెక్టర్

Published : Jan 31, 2022, 07:12 AM IST
Balakrishna: బాలయ్య టాక్ షో సక్సెస్ లో చిన్న కూతురు తేజస్విని పాత్ర... అసలు విషయం లీక్ చేసిన డైరెక్టర్

సారాంశం

బాలయ్య హోస్ట్ గా చేస్తున్నారనగానే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. లౌక్యం తెలియని ముక్కుసూటి బాలయ్య సక్సెస్ కావడం అసాధ్యం అన్నారు.

నటసింహం బాలయ్య (Balakrishna)అన్ స్టాపబుల్ షో ఓ ప్రభంజనం. వరల్డ్ వైడ్ రికార్డ్స్ నమోదు చేస్తున్న ఈ టాక్ షో బాలయ్య లోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. హోస్ట్ గా బాలయ్య నయా ట్రెండ్ షురూ చేశారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా కి మంచి ప్రచారం కల్పించింది అన్ స్టాపబుల్ షో. అన్ స్టాపబుల్ షోని ఓన్ చేసుకున్న బాలయ్య చెలరేగిపోతున్నారు. ఇక ఈ టాక్ షో మొదటి సీజన్ ముగిసింది. సూపర్ స్టార్ మహేష్(Mahesh)తో పాటు స్టార్ హీరోలు, దర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అసలు బాలయ్య హోస్ట్ గా చేస్తున్నారనగానే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. లౌక్యం తెలియని ముక్కుసూటి బాలయ్య సక్సెస్ కావడం అసాధ్యం అన్నారు. సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్ అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు. బాలయ్య అన్ స్టాపబుల్ (Unstoppable)కూడా అట్టర్ ప్లాప్ కావడం ఖాయం అంటూ చాలా మంది డిసైడ్ అయ్యారు. అయితే విమర్శించిన వాళ్ళ నోళ్లను సక్సెస్ తో బాలయ్య మూయించాడు. జస్ట్ సక్సెస్ కాకుండా రికార్డు సక్సెస్ సాధించాడు. 

తెరపై బాలయ్య తన మాటతీరు, మేనరిజం, లుక్స్ తో సక్సెస్ కి కృషి చేస్తే... తెర వెనుక షో కోసం చాలా మంది పనిచేసారు. వారిలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా ఉన్నారు. అన్ స్టాపబుల్ షో డైరెక్టర్ బివిఎస్ రవి తాజాగా ఈ షో గురించి కొన్ని కీలక సమాచారం పంచుకున్నారు. అంచనాలకు అమ్మా మొగుడు అంటూ బాలయ్యను ఆకాశానికి ఎత్తిన బీవీఎస్ రవి... తేజస్విని కూడా ఈ సక్సెస్ లో భాగమయ్యారు అన్నారు. 

బాలయ్య లుక్, కాస్ట్యూమ్స్ గురించి ఆమె రీసెర్చ్ చేశారట అన్ స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య అందంగా కనిపించడం వెనుక తేజస్విని ప్రమేయం ఉందట. ఆయన లుక్ డిజైన్ చేసింది ఆమె నట. బాలయ్య ఇద్దరు కుమార్తెలు పరిశ్రమకు చాలా దూరంగా ఉంటారు. అయితే చిన్న కూతురు తేజస్విని మాత్రం ఈ విధంగా కొంత మేర ఇన్వాల్వ్ అవుతున్నారని అర్థం అవుతుంది. 

మరోవైపు బాలకృష్ణ నెక్స్ట్ మూవీ కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య తదుపరి చిత్రం ప్రకటించిన విషయం తెల్సిందే. క్రాక్ మూవీతో గోపీచంద్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా... బాలయ్య పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక బాలయ్య లేటెస్ట్  రిలీజ్ అఖండ (Akhanda)భారీ హిట్ కొట్టింది. బాలయ్యకు గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చింది.  
 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్