Deepika padukone: కాలినడకన తిరుమలకు దీపికా పదుకొనే...నేడు దర్శనం..

Published : Dec 15, 2023, 07:30 AM ISTUpdated : Dec 15, 2023, 07:34 AM IST
Deepika padukone: కాలినడకన తిరుమలకు దీపికా పదుకొనే...నేడు దర్శనం..

సారాంశం

ఒక సెలబ్రిటీలా కాకుండా.. సామాన్య భక్తురాలిగా మారిపోయింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే. ఈరోజు తెల్లవారుజామున దర్శనం చేసుకోబోతున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తిరుమల వచ్చారు. దర్శనం కోసం ఆమె కాలినడక మార్గం ద్వారా కొండ పైకి చేరారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం  దీపికా పదుకునే.. గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం గుండా.. గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి నడిచారు. దాదాపు  ముడున్నర గంట పాటు నడుచుకుంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకునే తిరుమలకు చేరుకున్నారు.. 

అయితే దీపిక వెంట ఆమె సిబ్బంది కూడా ఉన్నారు. బాలీవుడ్ నటిని చూసిన భక్తులు ఫోటోల కోసం ప్రయత్నించడం,  సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.‌. అయితే ఆమె వెంట ఉన్న సిబ్బంది వారిని వారించి.. ఆమెకు రక్షణగా నడిచారు. కాలికిచెప్పులు కూడా లేకుండా.. దీపికా కొండపైకి నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్న దీపికా పదుకునే.. రాత్రికి అక్కడే బస చేసి..  శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొనబోతున్నారు.  విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రస్తుతం దీపికా పదుకునే తిరుమల ఫోటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. 

దీపికా పదుకొనె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.  ఈ ఏడాది ఆమె రెండు సినిమాల్లో నటించారు. షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన పఠాన్, జవాన్ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. ఇక ప్రస్తుతం దీపికా పదుకునే ఖాతాలో మూడుసినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ నుంచి కల్కీ సినిమాలో ఆమె నటిస్తోంది.  పాన్ వల్డ్ సినిమా గా రూపొందుతోన్న ఈసినిమాలో ఆమె  ప్రభాస్ జోడీగా నటిస్తోంది. కల్కి 2898 ఏడీ టైటిల్ తో ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.  వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్