నాని పాన్ ఇండియా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసే ప్రాజెక్ట్ ఇదే అని చెప్తున్నారు. వివేక్ ఆత్రేయ సినిమాతో పాటుగా దీన్ని కూడా సమాంతరంగా పూర్తి చేయాలని నాని భావిస్తున్నారు.
నానికి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యామిలీలు అతని సినిమాలకు వెళ్తూంటారు. ‘దసరా’తో సక్సెస్ తో మాస్ జనాలను సైతం తన ఖాతాలో వేసుకొన్నారు నాని. రీసెంట్ గా ఆయన హీరోగా రూపొందిన ‘హాయ్ నాన్న’యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మరీ మెలోడ్రామా ఎక్కువగా ఉందని టాక్ రావటం కాస్త దెబ్బ కొట్టింది. మరో ప్రక్క యంగ్ డైరక్టర్ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం కమిటయ్యి మొదలెట్టేసాడు. ఇప్పుడు నాని దృష్టి అంతా ప్యాన్ ఇండియా మార్కెట్ పై ఉంది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి చెప్పిన కథకు నాని పచ్చ జెండా ఊపారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ మరీ ఎక్కువగా ఉందని కాన్సిల్ అయ్యిందన్నారు.
ఈ క్రమంలో ఆ ప్లేస్ లోకి కల్ట్ మూవీ స్పెషలిస్ట్ కార్తీక్ సుబ్బరాజ్ ఇటీవల నానిని కలిసి ఒక కథ చెప్పాడని, నాని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడని ఫిల్మ్ నగరవర్గాల టాక్. నాని పాన్ ఇండియా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసే ప్రాజెక్ట్ ఇదే అని చెప్తున్నారు. వివేక్ ఆత్రేయ సినిమాతో పాటుగా దీన్ని కూడా సమాంతరంగా పూర్తి చేయాలని నాని భావిస్తున్నారు. మరోవైపు దసరా డైరక్టర్ తో అదే నిర్మాత కాంబినేషన్ లో కథ చెయ్యబోతున్నారని అంటున్నారు.
అయితే మొదటి నుంచీ తెలుగు ఆడియెన్స్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మూవీస్ అంతగా కనెక్ట్ అవటం లేదు. కెరీర్ ప్రారంభంలో తీసిన ‘పిజ్జా’ సినిమా తప్పితే ఇక్కడ పెద్దగా ఆడిన సినిమాలు ఏవీ లేవు. రజినీకాంత్ ‘పేట’ఇక్కడ డిజాస్టర్ అయ్యింది. కార్తీక్ సుబ్బరాజ్ రీసెంట్గా ఫిల్మ్ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తమిళంలో హిట్టయినా.. తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కొందరు నాని అభిమానులు...ఈ దర్శకుడుతో సినిమా వద్దని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ కాంబినేషన్ ఏ మేరకు సెట్ అవుతుందో చూడాలి.
ప్రస్తుతం నాని మాత్రం ప్రస్తుతం నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తున్న ఈ ఫిల్మ్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ కోసం బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది.