Latha Mangeshkar: వదంతులు ప్రచారం చేయకండి.. మాకు కొంచెం స్పేస్ కావాలి : లతా మంగేష్కర్ కుటుంబం

Published : Jan 22, 2022, 12:50 PM IST
Latha Mangeshkar: వదంతులు ప్రచారం చేయకండి.. మాకు కొంచెం స్పేస్ కావాలి : లతా మంగేష్కర్ కుటుంబం

సారాంశం

బాలీవుడ్ స్వరదిగ్గజం.. లతా మంగేష్కర్(Latha Mangeshkar) కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. 92 ఏళ్ల లతాజీ.. దాదాపు 10 రోజులకు పైగా ఐసీయూలోనే ఉన్నారు. అయితే లతాజీ ఆరోగ్యం పై వస్తున్న వదంతులను ఖండీంచారు ఆమె అధికార ప్రతినిధి. అనవసరంగా వదంతులు వ్యాప్తి చెందించవద్దన్నారు.

బాలీవుడ్ స్వరదిగ్గజం.. లతా మంగేష్కర్(Latha Mangeshkar) కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. 92 ఏళ్ల లతాజీ.. దాదాపు 10 రోజులకు పైగా ఐసీయూలోనే ఉన్నారు. అయితే లతాజీ ఆరోగ్యం పై వస్తున్న వదంతులను ఖండీంచారు ఆమె అధికార ప్రతినిధి. అనవసరంగా వదంతులు వ్యాప్తి చెందించవద్దన్నారు.

ఉత్తరాది గానకోకిల.. స్వర సరస్వతి, విఖ్యత గాయని లతా మంగేష్కర్ (Latha Mangeshkar) ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఆమె ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉంది. ఈనెల 11న కరోనా బారిన పడిన ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పటి నుంచీ ఆమెను ఐసీయూలోనే ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. మొదట ఆమె ఆరోగ్యం బాగానే ఉంది అని ఫ్యామిలీ మెంబర్స్ మీడియాకు చెప్పారు. అటు డాక్టర్స్ కూడా పరిస్థితి బాగానే ఉంది. ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని చెప్పడంతో..  అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.

 కాని లతా జీ మంగేష్కర్ (Latha Mangeshkar)  హస్పిటల్ లో చేరి పది రోజులు పైనే అవుతుంది. ఇంత వరకూ ఆమె కోలుకున్నట్టు న్యూస్ రాలేదు. కనీసం ఐసీయూ నుంచి కూడా బయటకు రాలేదట లతాజీ. ఇంకా కోలుకునే దాకా.. హస్పిటల్ లోనే.. అందులోను ఐసీయూ లోనే ఉంచాలని డాక్టర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాంతో అభిమానుల్లో  ఆందోళ మొదలయ్యింది.  తమ ఆరాధ్య గాయనిని గురించి శుభవార్త చెప్పాలంటూ వారు వేడుకుంటున్నారు.

అంతే కాదు. ఈ మధ్య ఆమో ఆరోగ్యం గురింరచి రకరకాల వదంతులు వ్యాప్తి చెందాయి. లతాజీ ఆరోగ్యం బాలేదని. ఆమె పరిస్థితి విషమంగా ఉందని రకరకాలుగా న్యూస్ సోషల్ మీడియాలో వ్యప్తి చెందింది. అతే కాదు ఆమె కోలుకోవడం కష్టం అంటూ.. లతా మంగేష్కర్ అభిమానులు ఆందోళన చెందేలా వార్తలు బయటకు వస్తుండటంతో.. ఆమె అధికార ప్రతినిధి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అసవరసర వదంతులు ప్రచారం చేయకండి. లతాజీకి సంబంధించిన ఏ విషయం అయినా తామే ప్రనకటిస్తామన్నారు. అంతే కాదు ఆమె కు చికిత్స చేస్తున్న డాక్టర్లకు,కుటుంబ భ్యులకు స్పేస్ ఇవ్వకండి. ఇన్ని రకాలుగా వార్తలు బయటకు వస్తుంటే వారి ప్రశాంతతకు భంగం కలుగుతుంది అంటూ.. లతాజీ ప్రతినిథులు ప్రకటన చేసినట్టు సమాచారం. అంతే కాదు గాన కోకిల ఐసీయూలో క్షేమంగా ఉన్నారని. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.

కాని  ఆమె ఇంకా కోలుకోవల్సింద చాలా ఉందని.. గ్రేట్ సింగర్ త్వరగా కోలుకోవాలని అభిమానులంతా దేవుడిని ప్రార్ధించాలి అంటూ.. డాక్టర్స్ సైతం పిలుపునిచ్చినట్టు సమాచారం. అంతే కాదు లతా మంగేష్కర్ మంగేష్కర్ (Latha Mangeshkar)  ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఇంకా టైమ్ పడుతుందట.. ఇంకా ఓ పదిరోజుల వరకూ ఆమె ఐసీయూలోనే ఉండాల్సి వస్తుందంటున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు కంగారు పడుతున్నారు. ఇన్ ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.


 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?