RRR నిర్మాతతో ప్రభాస్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 22, 2022, 08:42 AM IST
RRR నిర్మాతతో ప్రభాస్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతులో దాదాపు అరడజను పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభాస్ కొత్త చిత్రాలకు సైన్ చేయడం మాత్రం ఆపడం లేదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతులో దాదాపు అరడజను పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభాస్ కొత్త చిత్రాలకు సైన్ చేయడం మాత్రం ఆపడం లేదు. తాజాగా ప్రభాస్ మరో చిత్రానికి సైన్ చేశాడు. 

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ఒకెత్తయితే.. ఈ ఒక్క చిత్రం మరో ఎత్తు. అంటే ఆ చిత్రాలని మించిన భారీ చిత్రం అని అర్థం కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ లో ఉండే చిత్రాలు చేస్తున్నాడు. కానీ ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో ప్రభాస్ అంగీకరించిన చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

మారుతి చెప్పిన ఫ్యామిలీ కథ లైన్ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు సైన్ కూడా చేశాడట. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా హైబడ్జెట్ మూవీస్ చేస్తున్నాడు. ఈ చిత్రాల గ్యాప్ లో మారుతీ ఈ మూవీని ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది. 'ప్రభాస్' ని అభిమానులు డార్లింగ్ తరహా చిత్రంలో చూసి చాలా కాలమే అవుతోంది. 

ఈ యాక్షన్ చిత్రాల గోలలో ఈ మూవీ కాస్త రిలాక్సింగ్ గా ఉండబోతోంది. మారుతి చిత్రాల్లో కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా బావుంటుంది. దీనితో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలయింది. 

ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నుంచి ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి చిత్రాలు రాబోతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jana Nayagan Censor: 'జననాయగన్' సినిమాకు సెన్సార్ కత్తెర, ఏకంగా 12 సీన్లు కట్.. నిడివి ఎంతంటే?
Allu Arjun Political Entry: రాజకియాల్లోకి అల్లు అర్జున్? సీక్రెట్‌గా బ్యాక్‌ గ్రౌండ్‌ వర్క్.. బన్నీ టీమ్‌ రియాక్షన్‌ ఏంటంటే?