స్పీడుమీదున్న బాలయ్య బాబు.. ఘనంగా NBK109 ఓపెనింగ్

Published : Jun 10, 2023, 07:33 PM IST
స్పీడుమీదున్న బాలయ్య బాబు.. ఘనంగా NBK109 ఓపెనింగ్

సారాంశం

బాలయ్య బాబు యమా  స్పీడుమీద ఉన్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. అది కూడా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ షాక్ ఇస్తున్నాడు. ఇక తాజాగా ఆయన తన 109వ సినిమాను చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు. 

నందమూరి బాలకృష్ణ హీరోగా NBK 109 మూవీ చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది. మెగా డైరెక్టర్  బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెతో ఈ సినిమా తెరకెక్కుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్  గా అభిమానులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. వరుసగా  భారీ బ్లాక్ బస్టర్లను అందిస్తూ తన మాస్ ఫ్యాన్స్ ను  అలరిస్తున్నారు బాలయ్య బాబు. ఇక ప్రస్తుతం మరో బ్లాక్ బస్టర్ కోసం భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు బాలయ్య.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ కలిసి ఈ సినిమాను చేయబోతున్నారు. 

ఈసినిమా ఓపెనింగ్ ఈరోజు (జూన్ 10) పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను బడా మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ తన చేతుల మీదుగా మూవీ టీమ్ కు అందచేయగా..  దక్షిణ కొరియా గౌరవ కౌన్సెల్ జనరల్ చుక్కపల్లి సురేష్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. డైరెక్టర్  గోపీచంద్ మలినేని కెమెరా స్విచాన్ చేయగా... మొదటి షాట్ కి మాటల మాంత్రికుడు,  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

 

 

ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలిపేలా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలు బాక్స్ లో ఉండగా.. హీరో పాత్ర ఎంత పవర్ పుల్ గా ఉంటుందో సింబాలిక్ గా చూపించారు.  కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగేలా చేశారు మేకర్స్.. వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్" అనే లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో వివరించారు. అలాగే "ప్రపంచానికి అతను తెలుసు.. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు" అంటూ పోస్టర్ పై రాసున్న సినిమా ట్యాగ్‌లైన్ ఆకట్టుకుంటోంది.

 

ఈ రెండు లైన్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు దర్శకుడు. ఇక ఈసినిమాను 2024 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇతర వివరాలు త్వరలెో వెల్లడించబోతున్నట్టు ప్రకటించారు.  ప్రస్తుతం బాలకృష్ణ.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లు 108 మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈసినిమాకు భగవంత్ కేసరి టైటిల్ ను ప్రకటించారు మూవీ టీమ్. అంతే కాదు నటసింహం నుంచి గ్లోబల్ లయన్ గా బాలయ్య బిరుదును ప్రకటించారు ఫ్యాన్స్. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?