
జూన్ రిలీజ్ కు ప్లాన్ చేసినా.. మేకింగ్ మరింత ఎఫెక్టి సెప్టెంబర్ ఎండింగ్‌కు షిఫ్ట్ అయిన స్పైడర్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. స్వయంగా హీరో మహేశ్ బాబు ట్వీట్ చేసి.. ఈ సినిమా దసరా సీజన్‌లో రాబోతోందని చెప్పడంతో... సూపర్ స్టార్ మహేష్ అభిమానుల్లో ఉన్న సస్పెన్స్ కూడా తొలిగిపోయింది.
ఇప్పటికే రిలీజైన టీజర్ అంచనాలు పెంచుతున్న నేపథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్‌లో పర్ఫెక్షన్ కోసమే చిత్ర దర్శకుడు మురగదాస్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నార్ననది సుస్పష్టం. బాహుబలి పెంచిన హై వేల్యూస్ ను రీచ్ కావాలంటే ఈ సినిమాను ప్రతి ఫ్రేమ్ పర్ ఫెక్ట్ గా ఉండేలా రూపొందించాలన్నదే దర్శకుడు మురుగదాస్ ఆలోచన.
అయితే మహేష్ స్పైడర్ విడుదల ఆలస్యం కావడానికి.. బాలీవుడ్ సినిమాలే కారణమని బీ టౌన్ మీడియా ప్రచారం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆగస్టు 11న స్పైడర్ మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేశారని.. అయితే ఆ సమయంలో కింగ్ ఖాన్ షారూఖ్ 'రెహనుమా', అక్షయ్ కుమార్ సినిమా 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' ఉండటం వల్లే ఈ సినిమా వెనక్కు వెళ్ళిందని ప్రచారం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలతో ఇలా మహేష్ సినిమాను పోల్చి కథనాలు రాస్తుండటమే ఈ సినిమా రేంజ్ కు అద్దం పడుతోంది.
అయినా.. తెలుగు,తమిళం రెండు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా తమిళంలో సరైన రిలీజ్ డేట్ దొరక్క వెనక్కి తగ్గారంటే ఓ అర్థం ఉందని.. ఏకంగా బాలీవుడ్ సినిమాల కారణంగా 'స్పైడర్' విడుదల వాయిదా వేశారనడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు.. బాహుబలి 2 తరువాత తెలుగు సినిమాలన్నీ బీ టౌన్ సినిమాలకు పోటీ ఇస్తాయనే ఉద్దేశంతో బాలీవుడ్ బాబులు ఇలా ఊహించుకుంటున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
సో బాహుబలి ఇచ్చిన భారీ సక్సెస్ నేపథ్యంలో బీటౌన్ మీడియా కన్ను తెలుగు సినిమాలపై బాగానే పడిందనాలి. అందుకే 'స్పైడర్' విషయంలోనూ బాలీవుడ్ మీడియా చాలా ఎక్కువగా ఊహించుకుంటోందని క్లియర్‌గా అర్థమవుతోంది. మరి స్పైడర్ రేంజ్ ను అమాంతం పెంచేసి ఊారీ వసూళ్లు సాధించే దిశగా బాలీవుడ్ మీడియా ప్రచారం కల్పించాలని ఆశిద్దాం.