
ప్రభాస్, ‘కె.జి.యఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’ హంగామా మామూలుగా లేదు. నిన్నటి నుంచి టికెట్ల కోసం థియేటర్స్ దగ్గర అభిమానులు వందలాదిగా బారులు తీరారు. మైత్రీ మూవీస్ తీసుకున్న ఈ ఆఫ్ లైన్ టిక్కెట్ల అమ్మకం...నిర్ణయం కొంత వివాదాస్పదంగా ఉన్నా ‘సలార్’ క్రేజ్‌ను ఎంత ఉంది అనిపించటానికి ప్రపచం చూస్తోంది. ఈ క్రమంలో తెలంగాణా గవర్నమెంట్ ఎర్లీ మార్నింగ్ 1AM షోలుకు ఫర్మిషన్ ఇచ్చింది. నైజాం ఏరియాలో మొత్తం 20 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంటకు షోలు పడనున్నాయి. ఆ థియోటర్స్ లిస్ట్ ...
1) నెక్సస్ మాల్ - కూకట్‌పల్లి
2) ఏఎంబీ సినిమాస్ - గచ్చిబౌలి
3) భ్రమరాంబ - కూకట్‌పల్లి
4) మల్లికార్జున - కూకట్‌పల్లి
5) అర్జున్ - కూకట్‌పల్లి
6) విశ్వనాథ్ - కూకట్‌పల్లి
7) సంధ్య 70ఎంఎం - ఆర్టీసీ క్రాస్‌రోడ్స్
8) సంధ్య 35ఎంఎం - ఆర్టీసీ క్రాస్‌రోడ్స్
9) రాజధాని డీలక్స్ - దిల్‌సుఖ్ నగర్
10) శ్రీరాములు - మూసాపేట
11) గోకుల్ - ఎర్రగడ్డ
12) శ్రీ సాయిరాం - మల్కాజిగిరి
13) ఎస్వీసీ తిరుమల - ఖమ్మం
14) వినోద్ - ఖమ్మం
15) వెంకటేశ్వర - కరీంనగర్
16) నటరాజ్ - నల్గొండ
17) ఎస్వీసీ విజయ - నిజామాబాద్
18) వెంకటేశ్వర - మహబూబ్ నగర్
19) శ్రీనివాసా - మహబూబ్ నగర్
20) రాధిక - వరంగల్.
‘ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ ఖాన్సార్ కథ మార్చింది.. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం’ అనే డైలాగుతో వచ్చిన #Salaar ట్రైలర్‌ను ఓ రేంజిలో పేలింది. ప్రభాస్, పృధ్వీరాజ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు ఎలా అయ్యారు..వారు ఏం చేస్తూంటారు. తన ప్రాణ స్నేహితుడు కోసం ప్రభాస్ ఏం చేస్తాడు వంటి విషయాలతో నడుస్తూ ,వారిద్దరూ, బద్ధ శత్రువులుగా మారడంతోనే సలార్ పార్ట్ 1 ముగిసే అవకాశం ఉంది. పార్ట్ 2లో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య పోరును చూపిస్తారు దర్శకుడు అని ట్రైలర్ చూసిన వారికి అర్దమైంది. అలాగే ట్రైలర్ లో విజువల్స్ చూసే వారికి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని తెలిసిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే లెక్కలు మీడియాలో,ట్రేడ్ లో మొదలయ్యాయి.
ఈ చిత్రం మొదటిరోజు అంటే డిసెంబర్ 22న వరల్డ్‌వైడ్‌గా రూ. 150 నుంచి 160 కోట్ల గ్రాస్‌ను #Salaar ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే #Salaar మొదటి వారం రూ. 500 నుంచి 600 కోట్ల గ్రాస్, ఓవరాల్‌గా రూ. 1200 కోట్ల పై చిలుకే గ్రాస్ కలెక్ట్ చేస్తుంది (వరల్డ్‌వైడ్ అన్ని భాషల్లో కలిపి) అని అంచనా. ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా ఈ ఫిగర్స్ ని రీచ్ అయ్యిపోవచ్చు.
డిసెంబర్ 22న ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో తెలుగు, కన్నడంతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’ . ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.