ఫ్యామిలీతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిసి కమెడిన్ అలీ, వైరల్ అవుతున్న ఫోటోస్.

Published : Apr 23, 2023, 04:05 PM IST
ఫ్యామిలీతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిసి కమెడిన్ అలీ, వైరల్ అవుతున్న ఫోటోస్.

సారాంశం

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ని కుటుంబ సమేతంగా కలిసారు స్టార్ కమెడియన్ అలీ. మెగాస్టార్ తో కలిసి రంజాన్ సెలబ్రేట్ చేసుకున్న ఆయన.. తన ఆనందాన్ని  వ్యక్తం చేశారు. 

టాలీవుడ్ స్టార్ కమెడియన అలీ.. తన సతీమణి జుబేద.. తమ్ముడు.. టాలీవుడ్ కమెడియన్  ఖయ్యూం అలీ, ఖయ్యూం సతీమణి, వారి పిల్లలు సహా ఫ్యామిలీ అంతా కలిసి  మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి  రంజాన్ సందర్భంగా వెళ్లిన అలీ ఫ్యామిలీకి చిరంజీవి  శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను అలీ సంతోషంగా జరుపుకోవాలని.. అల్లా దీవెనలు అలీ కుటుంబంపై ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు. 

ఇక తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని.. తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి జరుపుకోవడం.. అది కూడా తన ఫ్యామిలీతో సహా  పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అలీ. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సమస్త మానవాళికి మానవ సేవ చేయాలన్న సందేశాన్ని అందిస్తుందని అలీ అన్నారు. 

ప్రస్తుతం అలీ తన ఫ్యామిలీతో మెగాస్టార్ ను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా యాక్టీవ్ గా ఉన్నారు అలీ. ఏపీ ప్రభుత్వం తరపున టాలీవుడ్ మీడియా సలహాదారుగా ఉన్నారు అలీ.  మొన్నటి వరకూ బుల్లితెరపై హోస్ట గా మెరిసిన ఆయన.. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ.. పొలిటికల్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈసినిమా తరువాత చేయాల్సిన నెక్ట్స్  సినిమాలకు సబంధించి పనుల్లో బిజీ అయిపోయారు. ఇటు ఇండస్ట్రీకి సబంధించిన  విషయాల్లో కూడా ఆయన చాలాఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు మంచి సినిమాలు వచ్చినప్పుడు .. పిలిచి మరీ అభినందిస్తున్నారు చిరు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్