మంజు వారియర్ మంచి మనసు, తన కారును వెంబడించిన అభిమానికి సర్ ప్రైజ్

Published : Apr 13, 2023, 11:03 AM IST
మంజు వారియర్ మంచి మనసు, తన కారును వెంబడించిన అభిమానికి  సర్ ప్రైజ్

సారాంశం

తన కారును వెంబడిస్తూ వచ్చిన అభిమానికి అదిరిపోయేగిఫ్ట్ ఇచ్చింది  నటి మంజువారియర్. ఓ ఈవెంట్ కోసం వెళ్లిన ఆమెకు డైహార్ట్ ఫ్యాన్స్  కనిపించడంతో.. దిల్ ఖుష్ అయ్యింది యాక్ట్రస్.   

ప్రముఖ నటి, గాయిన  మంజు వారియర్ కు ఒక విచిత్ర సంఘటన ఎదురయ్యింది. కేరళలోని ఎర్నాకులంలో  ఒక ఈవెంట్ కోసం వెళ్ళిన ఆమెకు అనుకోని విధంగా ఓ విషయం తెలిసింది.  ఈవెంట్ లో పాల్గోని.. భారీగా వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగిన మంజు వారియర్..  వేదిక నుండి బయలుదేరి తన కారులో వెళ్తుండగా..  ఒక యువతి తన కారును వెంబడించడం మంజు వారియర్ గమనించింది. అయితే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉండటంతో.. కారు ఆపడం కుదరక అలానే ముందుకు వెళ్ళింది. 

అయినాసరే  ఆ అభిమాని తన కారునువెంబడిస్తూ.. అలానే పరిగెత్తుతుూనే ఉండటంతో.. తన డ్రైవర్ ను కారు ఆపమని ఆమెతో మాట్లాడింది మంజు. తన కారు డోరు దగ్గరకు ఆ అభిమానిని  రావాలని మంజు కోరింది. ఆ తర్వాత మంజు ఆ అమ్మాయి చెప్పిన విషయం విని ఎంతో సంతోషించింది. అయితే అసలు విషయం ఏంటీ అని ఆ కారును వెంబడించిన అమ్మాయిని మీడియా అడగగా.. ఆమె జరిగిన విషయం అంతా చెప్పింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే..? తన తల్లి మంజుకు పెద్ద అభిమాని అయినందున ఆమెకు రెండు నిమిషాలు సమయం కావాలని ఆయువతి మంజుతో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ యువతి తల్లి పుట్టిన రోజు కావడంతో.. తన అభిమాన నటి అయిన మంజు తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని కోరింది. ఇది తన తల్లికి తానిచ్చే అతిపెద్ద బహుమతి అవుతుందంటుంది ఆ యువతి. 

అయితే ఆ అమ్మాయి కోరికను కాదనలేని మంజు యువతికి తన నంబర్ ఇవ్వమని  తన అసిస్టెంట్ కు పురమాయించింది.  తను తనల్లితో తప్పుకుండా మాట్లాడతానని.. హామీ ఇచ్చింది మంజు వారియర్.  దాంతో యువతి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. ఆమె  మీడియాతో మాట్లాడుతూ, "మా తల్లి మంజు వారియర్‌కు విపరీతమైన అభిమాని. ఆమెను చాలా ఆరాధిస్తుంది. అటుంటిది తన తల్లితో మాట్లాడమని అడిగితే వెంటనే ఒప్పుకుంది. మంజు నిజంగా చాలా మంచి దయకలిగిన స్టార్ అంటూ.. ఆయువతి మాట్లాడింది. 

ఈమధ్య సినిమాలు తగ్గించింది మంజు వారియర్. అయితే చేసే  తక్కువగా సినిమాలు కూడా తన ఇమేజ్ కుభిన్నంగా ఉండే హుషారైన పాత్రలు  చేస్తోంది. రీసెంట్ గా అజిత్ హీరోగా నటించిన తునివు సినిమాలో మెరిసింది సీనియర్ బ్యూటీ. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె మాట్లాడింది. నేను ఎంచుకునే కథలు.. నాతో పాటు ఆడిన్స్ ను కూడా ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నాను అన్నారు మంజు వారియర్. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌