అల్లుడు చైతన్యకి నాగబాబు ఖరీదైన, సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్..

Published : Apr 17, 2021, 09:15 PM IST
అల్లుడు చైతన్యకి నాగబాబు ఖరీదైన, సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్..

సారాంశం

నిహారిక వివాహం గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు నాలుగు నెలలు గడిచాక అల్లుడు చైతన్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని భావించాడట నాగబాబు

నాగబాబు తన అల్లుడికి ఖరీదైన సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పెళ్లి తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనుకున్నట్టు, ఇన్నాళ్లకు కుదిరిందంటూ రేంజ్‌ రోవర్‌ కారుని బహుమతిగా ఇచ్చాడు నాగబాబు. ప్రస్తుతం ఆ వీడియోని తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకున్నారు. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహం గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. 

దాదాపు నాలుగు నెలలు గడిచాక అల్లుడు చైతన్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని భావించాడట నాగబాబు. `పెళ్లి తర్వాత అల్లుడికి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. ఉగాదికే ఇవ్వాలని ప్లాన్‌ చేశాం. కానీ కుదరలేదు. ఇప్పటికీ ఓకే అయ్యింది. రేంజ్‌ రోవర్‌ డిస్కవరీ కారుని గిఫ్ట్ గా ఇస్తున్నాను` అని తెలిపాడు నాగబాబు. ఈ సందర్భంగా ఆయన కారు షోరూమ్‌కి కారులో వెల్లడం, ఆ తర్వాత కార్‌ కొనుగోలు చేయడం, ఆ వెంటనే అల్లుడి ఇంటికి తీసుకెళ్లడం, నిహారిక, చైతన్యలకు ఈ గిఫ్ట్ ఇవ్వడం చక చక జరిగిపోయాయి.  ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు చైతన్య. నిహారిక కేక్‌ని చైతూకి, చైతూ నిహారికకి తినిపించారు. 

అత్యంత లగ్జరీ కార్లలో ఒకటైన రేంజ్‌ రోవర్‌ డిస్కవరీ భారీ ఖరీదైనది కావడం విశేషం. దీని విలువ దాదాపు 80లక్షలు ఉంటుందని సమాచారం. ఇక నాగబాబు పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో,యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. నాగబాబు చేతిలో ప్రస్తుతం ఒక్క షో కూడా లేదు. ఈ తెలుగు స్పెషల్‌షోస్‌లో మెరుస్తున్నారు. మరోవైపు తన యూట్యూబ్‌ ఛానెల్‌లో `ఖుషి ఖుషీగా` అనే స్టాండప్‌ కామెడీ షోని నిర్వహిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌