బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రాకు వేధింపులు, పోలీసులను ఆశ్రయించిన నటి

Published : Apr 15, 2023, 08:20 PM IST
బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రాకు వేధింపులు, పోలీసులను ఆశ్రయించిన నటి

సారాంశం

బాలీవుడ్ లో వివాదాలకు కేరాప్ అడ్రస్ గా నిలుస్తోంది శృంగార తార షెర్లిన్ చోప్రా. ఎప్పుడూ ఏదో ఒక వివాదం తన చుట్టూ తిరుగుతుంటుంది. ఈక్రమంలో మరోసారి చిక్కుల్లో పడింది బ్యూటీ. 

బాలీవుడ్ శృంగార తారల్లో షెర్లిన్ చోప్రా ఓకర‌ు. అంతే కాదు వివాదాస్పద నటీమణుల్లో కూడా ఆమె ఒకరు వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు ఆమె.  ఫోర్నోగ్రఫీ కేసు, డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ స్టార్స్ పై రకరకాల విమర్షలు.. ఇలా చాలా రకాలుగా ఆమె బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతుంది బ్యూటీ. తాజాగా మరోసారి ఆమె వివాదంలో చిక్కుంది. అది కూడా ఓ ఫైనాన్షియర్ చేతుల్లో చిక్కుకుంది. 

నటి షెర్లిన్ చోప్రాకు ఒక ఫైనాన్షియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. తనను వేధిస్తున్నాడంటూ.. సదరు వ్యక్తిపై... షెర్లిన్ ముంబై పోలీసులకు కంప్లైయింట్  చేసింది. ఒక  వీడియో రికార్డింగ్ విషయంలో.. తనను ఫైనాన్షియర్ వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు ఫైనాన్షియర్ తో.. వీడియో రికార్డింగ్ కు తాను ఒప్పుకున్నానని, కానీ అనివార్య కారణాల వల్ల వీడియో షూటింగ్ లో పాల్గొనలేక పోతున్నానని అంటోంది...  షర్లిన్. 

అంతే కాదు  తాను తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి కూడా తాను  ఒప్పుకున్నానని చెప్పింది. అయినా సరే తనపై కోపంతో.. పగబట్టి వేదిస్తున్నాడని అంటుంది బాలీవుడ్ సెక్సీ క్వీన్.  ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు.  గతంలో కూడా చాలా మందితో ఆమెకు ఇలాంటి వివాదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో..  సల్మాన్ ఖాన్ పై కూడా షెర్లిన్ ఇలానే విమర్శలు గుప్పించింది.  బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఫేస్ చేస్తున్న దర్శకుడు సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ రియాల్టీ షోకు తీసుకోవడంపై ఆమె మండిపడింది. సల్మాన్ ను ఘాటుగా  విమర్శించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు