ఈమధ్య బాలీవుడ్ స్టార్లు ఆధ్యాత్మికయాత్రల్లో మునిగి తేలుతున్నారు. ఖాన్ హీరోలతో పాటు.. ఇతర తారలు కూడా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. తాజాగా సారా అలీ ఖాన్.. చార్ ధామ్ యాత్రలో సందడి చేస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ... స్టార్ కిడ్ సారా అలీ ఖాన్.. ఆధ్యాత్మిక యాత్రలో మునిగితేలుతోంది. భక్తి పారవశ్యంలో తేలుతోంది బ్యూటీ. సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సారా.. తన లైఫ్ ను స్వతంత్రంగా లీడ్ చేస్తుంటుంది. ఈమధ్యే సారా ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమేన కేదార్‌నాథ్‌కు వెళ్లొచ్చింది. హిమాలయ పర్వత సానువుల్లోని ఎత్తైన కొండ దారిలో నడుచుకుంటూ వెళ్లి కేదార్‌నాథీశ్వరుడిని దర్శించుకుంది.
ఎంతో మంది జీవితంలో ఒక్క సారి అయినా వెళ్లి రావాలి అని భావించే.. చార్‌ధామ్ యాత్రను.. సారా అలీ ఖాన్ పూర్తి చేశారు. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సారా సంగీతం వింటూ ట్రెక్కింగ్ చేస్తున్న దృశ్యాలు, బండరాయి మీద ధ్యాన ముద్రలో ఉన్న ఫొటోలు, సాధువు ఆమెను ఆశీర్వదిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన స్నేహితులతో కలిసి సారా... ఈ ఆధ్యాత్మక యాత్ర చేసినట్టు తెలుస్తోంది.
అయితే సారా అలీ ఖాన్.. ఇలా కేదార్‌నాథ్ దేవాలయానికి వెళ్లడం కొత్తేం కాదు.. మొదటిసారి కూడా కాదు. బాలీవుడ్‌లో తన మొదటి సినిమా కేదార్‌నాథ్. ఈ షూటింగ్ కోసం ఆమె ఇక్కడే చాలా రోజులు ఉంది. అప్పుడే ఈ ప్రాతంపై ఆమెకు ఎంతో అభిమానం ఏర్పడింది. అంతే కాదు.. ఇక్కడ ప్రతీ విషయం ఆమెకు తెలుసు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మంచి వసూళ్లు కూడా సాధించింది.
కేదార్ నాధ్ సినిమా తరువాత సారా అలీఖాన్ .. లవ్ ఆజ్ కల్, లూకా చిప్పి, జరా హట్కే జరా బచ్‌కే వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమార్తె అయిన సారా.. అనతికాలంలోనే బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది