`పొలిమేర2`కి మూడో పార్ట్.. కన్ఫమ్‌ చేసిన దర్శకుడు..

By Aithagoni Raju  |  First Published Oct 30, 2023, 11:34 PM IST

చిన్న సినిమా పెద్ద విజయం.. ఊహించని అంచనాలను పెంచుతుంది. `పొలిమేర 2` సినిమా కూడా అంతే. మొదటి భాగం ఓటీటీలో రిలీజ్‌ కాగా, ఇప్పుడు పార్ట్ 2 గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి రిలీజ్‌ అవుతుండటం విశేషం.


సత్యం రాజేష్‌ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం `మా ఊరి పొలిమేర 2`. డా. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. ఇది `పొలిమేర`కి రెండో భాగం. సత్యం రాజేష్‌తోపాటు కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. గౌరీ కృష్ణ నిర్మాత. ఈ చిత్రాన్ని జీఏ2పై రిలీజ్ చేస్తున్నారు. నవంబర్‌ 3న రిలీజ్‌ కాబోతుంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు అనిల్‌ విశ్వనాత్‌ మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. `పొలిమేర3`కి సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చాడు. 

`పొలిమేర` చిత్రం ఇంత పెద్ద హిట్‌ అవుతుందని తాను ఊహించలేదని, కొన్ని రోజుల తర్వాత దానికి మంచి పేరొచ్చిందని తెలిపారు. అయితే మొదట్లోనే తాను పూర్తి స్క్రిప్ట్ రాసుకున్నానని, కానీ సినిమా తీయడం పెరిగిపోవడంతో రెండు భాగాలు చేసినట్టు తెలిపింది. మొదటి భాగం ఓటీటీలోరిలీజ్‌ అయి ఆదరణ పొందింది. ఇప్పుడు రెండో భాగాన్ని రిలీజ్‌ చేస్తున్నారు.  రిలీజ్‌ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ, కథ రాసుకున్నప్పుడే తప్పనిసరిగా సీక్వెల్ చేద్డామని అనుకున్నం. కథలో వున్న సీరియస్ నెస్, ఇంకా చెప్పాలనుకున్న కథ మిగిలిపోవడంతో పార్ట్ 2లో ఆ కథను చెబుదామని అనుకున్నాం. ఎక్కడైతే పార్ట్ 1 ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే  మొదలవుతుంది. ఇది పక్కా సీక్వెల్` అని చెప్పారు. 

Latest Videos

ఈ సందర్భంగా పొలిమేర 3` కూడా ఉంటుందని తలిపారు. స్క్రిప్ట్ రెడీగా ఉంది, కాకపోతే ఇమ్మీడియెట్‌గా అది ఉండకపోవచ్చు అని తెలిపారు. దీనికితోడూ మూడో భాగంలో కథ కూడా మారుతుందని తెలిపారు. `పొలిమేర 2`ని కార్తికేయతో పోల్చడంపై రియాక్ట్ అవుతూ, సినిమా విడుదల తరువాత `కార్తికేయ`కు మా కథకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. గుడి అనే కామన్ పాయింట్ తప్ప కార్తికేయ చిత్రానికి మా చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. 

`మొదటి పార్ట్ లో ఊహించని ట్విస్ట్ లు వుంటాయి. పతాక సన్నివేశాలు కూడా చాలా థ్రిలింగ్ గా వుంటుంది. అది పార్ట్ 2పై భారీ అంచనాలను పెంచిందని, స్క్రీన్ ప్లేను మరింత బలంగా తయారు చేసుకున్నాను. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్ లు వుంటాయి. తప్పకుండా పార్ట్ 1కు మించే విధంగా దానితో పొల్చితే దాదాపు పది రెట్ల థ్రిల్ ను ఫీలవుతారు. పతాక సన్నివేశాలు షాకింగ్ గా వుంటాయి. `పొలిమేర 3 కూడా వుంటుందని ప్రకటించాను. దీనికి సంబంధించిన కథ కూడా రెడీ గా వుంది` అని తెలిపారు. అయితే రెండో భాగం మాత్రం ఓ కొత్త అనుభూతినిస్తుందని, వెండితెరపై చూస్తే వాహ్‌ ఫీలింగ్‌ కలిగిందని తెలిపారు. 
 

click me!