షారుఖ్‌ఖాన్‌ సరికొత్త రికార్డ్.. 200 కోట్ల రెమ్యునరేషన్ తో షాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా.

Published : Apr 21, 2023, 04:49 PM IST
షారుఖ్‌ఖాన్‌ సరికొత్త రికార్డ్.. 200 కోట్ల రెమ్యునరేషన్ తో షాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా.

సారాంశం

బాలీవుడ్ బాద్ షా.. గురించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ విషయం ఏంటీ అంటే..? 


బాలీవుడ్‌  స్టార్ హీరో  షారుఖ్‌ఖాన్‌ సరికొత్త రికార్డును సాధించారు. ఇండియన్ సినిమాలో.. స్టార్లుగా వెలుగు వెలుగుతున్న టాప్ స్టార్స్ ను పక్కకు నెట్టి.. హైరెమ్యూనరేషన్ ను  తన ఖాతాలో వేసుకున్నారు. అది కూడా రీసెంట్ గా బాలీవుడ్ ను నిలబెట్టి.. భారీ కలెక్షన్స్ సాధించిన పఠాన్‌  సినమాతో ఈ రికార్డ్ ను కొల్ల గొట్టారు. పఠాన్ సినిమాతో  కలెక్షన్ల సునామీ సృష్టించిన షారుఖ్. చిత్రంతో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా నిలిచారు.

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత సాలిడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు షారుఖ్.. ఫెయిల్యూర్స్  నుంచి గుణపాఠం నేర్చుకున్న బాద్ షా... ఈసారి గట్టిగా కొట్టాలి అని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఈ విరామం అంతా కవర్ అయ్యేట్టు.. సాలిడ్ హిట్ కొట్టాడు. షారుఖ్‌ఖాన్‌ నటించిన పఠాన్‌ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లను సాధించింది.

ఇక ఈసినిమాతో బాలీవుడ్‌ పరువు నిలబెట్టడమే కాదు..  అగ్ర హీరో షారుఖ్‌ఖాన్‌ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ‘పఠాన్‌’ చిత్రంతో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా నిలిచారు.స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం షారుఖ్‌ఖాన్‌ తొలుత ఎలాంటి పారితోషికాన్ని తీసుకోలేదు. అయితే రిలీజ్ తరువాత లాభాల్లో కొంత వాటాను పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట షారుఖ్. 

ఇక అలా కుదుర్చుకోవడమే అతనికి కలిసి వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ తో... అగ్రిమెంట్ ప్రకారం షారుఖ్‌ఖాన్‌ దాదాపు 200కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకున్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఓ హీరో అందుకున్న అత్యధిక పారితోషికం ఇదేనని అంచనా.. ఇంతకు ముందు వరకూ.. ప్రభాస్, అక్షయ్ కుమార్, రజనీ కాంత్ లాంటి కొంత మంది స్టార్స్ మాత్రమే 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు అందరిని బీట్ చేసి... షారుక్ ఖాన్ ముందంజలో నిలిచారు. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?