హైదరాబాద్ లో 4 ఏళ్లు ఉన్న షారుఖ్ ఖాన్, ఛార్మినార్ కు నడుచుకుంటూ వెళ్లేవాడట..

Published : Nov 02, 2023, 01:56 PM IST
హైదరాబాద్ లో 4 ఏళ్లు ఉన్న షారుఖ్ ఖాన్,  ఛార్మినార్ కు నడుచుకుంటూ వెళ్లేవాడట..

సారాంశం

ఈరోజు(2 నవంబర్ ) 58వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.  బాలీవుడ్ లో అత్యంత కాస్ట్లీ హీరోగా పేరున్న షారుఖ్ ఇమేజ్ ముంబాయి కి మాత్రమే పరిమితం కాదు. ఆయన మన హైదరాబాద్ లో 4 ఏళ్లు ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇంతకీ విషయం ఏంటీ అంటే..? 


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హైదరాబాద్ లో నాలుగేళ్లు ఉన్నారని మీకుతెలుసా..? అవును నాలుగేళ్లు బాగ్యనగరంలో ఉన్న ఆయన ఛార్మినార్ చూడటానికి రోజు నడిచి వెళ్ళేవారట. అంతే కాదు టోలీ చౌక్ లో ఆయనకు ఓ ఇల్లు కూడా ఉందట.. ఇంతకీ ఈ విషయాలు ఎవరు చెప్పారో తెలుసా..? స్వయంగా షారుఖ్ ఖాన్ ఓ సందర్భంలో వెల్లడించారు. 

షారుఖ్ ఖాన్ ఇండియాలో స్టార్ హీరోల్లో ఒకరు. బాద్ షా  ఆస్తుల విలువ దాదాపు  6300 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. తాజాగా ఆయన నటించిన రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డ్ సృష్టించాయి. ఇక ఆయన ముంబయ్ లో ఉండే ఇల్లు మన్నత్ గురించి చెప్పాలంటే.. మయసభ, మాయా మహల్ కథలా ఉంటుంది. ఇక ముంబయ్ లో నివాసం ఉంటారు షారుఖ్... కాని ఆయన కొన్నాళ్లు హైదరాబాద్ లో ఉన్నారట. అది కూడా టోలీ చౌక్ లో ఉన్నారట. రోజు అక్కడి నుంచి చార్మినార్ చూడటానికి నడుచుకుంటూ వెళేవారట. 

షారుఖ్ ఖాన్ కు హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉంది. ఆయన హైదరాబాద్ లో నివసించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వల్ల .. షారుఖ్ ఖాన్ కు హైదరాబాద్ లో ఇల్లు ఉన్న సంగతి బయటకు వచ్చింది. హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని తెలిపిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  అందులో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. మా అమ్మమ్మ హైదరాబాద్ లోని టోలిచౌకి లో ఉండేవారు. మా అమ్మ కుటుంబం మొత్తం ఇక్కడే ఉండేవారు. చిన్న తనంలో మా అమ్మమ్మ నను దత్తత తీసుకున్నారు.  నేను దాదాపు నాలుగేళ్లు భాగ్యనగరంలోనే ఉన్నాను అన్నారు. 

అంతే కాదు హైదరాబాద్ లో ఉండగా..  చిన్న తనంలో చార్మినార్ చూడటానికి రోజూ వెళ్ళే వాడిని, ఛార్మినార్ వరకూ నడుచుకుంటూ వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి అని అన్నారు షారుఖ్ ఖాన్. అయితే నాలుగేళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్న షారుఖ్ ఫ్యామిలీ.. ఆతరువాత  బెంగుళూరు వెళ్లిపోయారట.. అంతే కాదు అంతకు ముందు కూడా సమ్మర్ హాలీడేస్ వస్తే..వెంటనే కు హైదరాబాద్ వచ్చి వెళ్తు ఉండేవాళ్ళంట.  ఈ విషయాలు స్వయంగా షారుఖ్ ఖాన్ తెలుపడంతో.. ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఇక షారుఖ్ ఖాన్ కు  ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు షారుఖ్. ఈ స్టార్ హీరో ఎలాంటి పాత్రనైనా చక్కగా పోషిస్తారు. ఎమోషన్స్ పండించడంలో బాలీవుడ్ లో షారుఖ్ తర్వాతే అని చెప్పాలి. షారుఖ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. నేడు షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు