Dunki Ott : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ఓటీటీ డిటేయిల్స్? భారీ రేట్ కు రైట్స్!?

Published : Dec 21, 2023, 03:51 PM ISTUpdated : Dec 21, 2023, 03:57 PM IST
Dunki Ott  : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ఓటీటీ డిటేయిల్స్? భారీ రేట్ కు రైట్స్!?

సారాంశం

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  ‘డంకీ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. ఈ సందర్బంగా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఓటీటీ డిటేయిల్స్ ఆసక్తికరంగా మారాయి.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘డంకీ’ (Dunki). సక్సెస్ ఫుల్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాకే దక్కింది. మొదటిరోజు గ్రాండ్ రిలీజ్ తోపాటు మంచి కలెక్షన్లు కూడా అందినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో డంకీ ఓటీటీ (Ott) డిటేయిల్స్ పై ఆసక్తికరమైన డిటేయిల్స్ అందాయి. ఏ ఓటీటీలో రానుంది.. ఎంత రేట్ కు అమ్ముడు పోయిందనే విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

అయితే, తొలుత ఈ భారీ చిత్రం నెట్ ఫ్లిక్స్ కు ఓటీటీ రైట్స్ ను ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం... ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమో (Jio Cinema)  ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా భారీ ధరకు అమ్ముడుపోయిందని సమాచారం. రూ.155 కోట్లకు డుంకీ డిజిటల్ రైట్స్ ను జియో సొంతం చేసుకుందని టాక్. ఈరోజే సినిమా థియేటర్లలోకి రావడంతో మరో నాలుగు వారాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. పక్కా డేట్ ఇంకా క్లారిటీ లేదు. 

షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో హార్డీ పాత్రలో అలరించారు. స్టార్ హీరోయిన్ తాప్పీ పన్ను Taapsee Pannu  తొలిసారిగా కింగ్ ఖాన్ తో కలిసి నటించింది. షారుఖ్ కు ధీటుగా పెర్ఫామ్ చేసినట్టు పలు సమీక్షల్లో తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్, బొమాన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. ప్రీతమ్, ఆమన్ సంగీతం, బీజీఎం అందించారు. రూ.150 కోట్లతో జిమో స్టూడియో, రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్, రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇక షారుఖ్ ఖాన్ ఇప్పటికే ‘జవాన్’, ‘పఠాన్’ చిత్రాలతో భారీ బ్లాక్ బాస్టర్లను అందుకున్నారు. రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి హౌరా అనిపించింది. ఇక ‘డంకీ’తోనూ కలెక్షన్ల పరంగా హ్యాట్రిక్ రికార్డును క్రియేట్ చేయాలని చూస్తున్నారు. లాంగ్ రన్ లో కొనసాగనున్న ఈ చిత్రం ఎంతమేరకు వసూళ్లు చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా