సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. సీనియర్ నటులు, నిర్మాతలు ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు రియో కపాడియా తుదిశ్వాస విడిచారు.
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సీనియర్ నటులు, నిర్మాతలు అనారోగ్యరీత్యా ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. ఇప్పటికే ఈరోజే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత గోగినేని ప్రసాద్, రీసెంట్ గా ‘జైలర్’ నటుడు మారి ముత్తు, నిన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు షోలే ఫేమ్ సతీందర్ కుమార్ ఖోస్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ చేధు ఘటనలు మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు రియో కపాడియా (Rio Kapadia) తుదిశ్వాస విడిచారు. 66 ఏళ్ల వయస్సులో ఆయన కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రియో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈరోజు మరణించారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు సామాజిక మాధ్యామాల ద్వారా తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియల్ని శుక్రవారం (రేపు) ముంబైలో నిర్వహించనున్నారు. రియో కపాడియా మరణంతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రియో మృతి పట్ల సంతాపం ప్రకటించింది. అసోసియేషన్ లో ఆయన 2004 నుంచి అంటే దాదాపు 20 ఏళ్లు గా సభ్యునిగా ఉన్నారు. ఇక పలువురు సెలబ్రెటీలు కూడా ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు. ఇక రియో కపాడియా బాలీవుడ్ చిత్రాలు, సీరియల్ లో నటించి గుర్తింపు పొందారు. షారుఖ్ నటించిన ‘చక్ దే ఇండియా’, ‘హ్యాపీ న్యూ ఈయర్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే ‘కుధా హఫిజ్’, ‘దిల్ చల్తా హై’ వంటి చిత్రాలతో పాటు ‘మేడ్ ఇన్ హెవెన్ 2 వెబ్ సిరీస్ లోనూ మృణాల్ ఠాకూర్ తండ్రి పాత్రలో నటించారు. ఇక సప్నే సుహానే లడక్ పాన్ కే, మహాభారత్, సాస్ భీ కభీ బహు థీ, క్యుంకీ, జుద్వా రాజా వంటి సిరీయల్స్ లోనూ నటించారు.
CINTAA expresses its condolences on the demise of Rio Kapadia (Member since 2004)
. pic.twitter.com/d6GOLdtUZu