Jawan Day7 Collections : ‘జవాన్’ వారం రోజుల కలెక్షన్స్.. ఆ విషయంలో ‘పఠాన్’ రికార్డు బ్రేక్..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ థియేటర్లలోకి వచ్చి వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం వారం రోజుల కలెక్షన్స్ తో మరో రికార్డును క్రియేట్ చేసింది. 
 

Shah Rukh Khans Jawan one week Box Office Collections NSK

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  నటించి లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘జవాన్’ (Jawan). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.126 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ హిందీ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక కేవలం ఫస్ట్ వీకెండ్ లోనే రూ.570 కోట్లు గ్రాస్ వసూల్ చేసి ఫాస్టెస్ట్ కలెక్షన్స్ మూవీ జాబితాలో చోటు దక్కింది.

ఇప్పటికే ఈ యాక్షన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద స్టడీగానే కలెక్షన్లు రాబడుతోంది. నేటితో వారం రోజులు పూర్తికావడం విశేషం. దీంతో ఏడురోజుల కలెక్షన్లూ ఆసక్తికరంగా ఉన్నాయి. వీక్ డేస్ పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ.660 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని అధికారికంగా వెల్లడించారు. ఆరో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.50 కోట్లు అందాయన్నారు. ఇక ఏడో రోజు రూ.23 కోట్లు అందాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెకండ్ వీకెండ్ లోనూ భారీ వసూళ్లు ఖాయమంటున్నారు. 

Latest Videos

భారీ మొత్తం వసూళ్లు అందడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రం కేవలం ఇండియాలోనే రూ.323 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇది షారుఖ్ గత చిత్రం ‘పఠాన్’ వారం రోజుల కలెక్షన్స్ దాటేసింది. ‘పఠాన్’ వారంలో రూ.317 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది. తాజాగా కలెక్షన్లతో షారుఖ్ తను క్రియేట్ చేసిన రికార్డును ‘జవాన్’ చిత్రంతో తానే బీట్ చేశాడు. ఇంకా ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింతగా వసూళ్లు చేయనుంది. ఇక ‘పఠాన్’ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘జవాన్’ ఆ దిశగా అడుగులు వేస్తోంది. 

మున్ముందు ఏమేరకు వసూళ్లు రాబడుతుందన్నదని వేచి చూడాలి. ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్ తో రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)  షారుఖ్ సరసన తొలిసారిగా నటించడం, బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడం విశేషం. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించడం, అనిరుధ్ సంగీతం, హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల పనితీరు ‘జవాన్’ను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టింది.

 

A storm called Jawan has taken over the world!🔥

Book your tickets now: https://t.co/B5xelUahHO

Watch in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/K5J7XuMHRI

— Red Chillies Entertainment (@RedChilliesEnt)
vuukle one pixel image
click me!