షాకిస్తున్న కరెంట్ బిల్లు.. కిడ్నీలు అమ్మేస్తానంటున్న నటుడు

Published : Jul 07, 2020, 02:53 PM IST
షాకిస్తున్న కరెంట్ బిల్లు.. కిడ్నీలు అమ్మేస్తానంటున్న నటుడు

సారాంశం

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమకు వచ్చిన భారీ పవర్ బిల్స్ విషయంలో అసహనం వ్యక్తం చేయగా.. మరికొందరు ఫన్నీగా కామెంట్  చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఇంటికి లక్ష రూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చిందని ట్విటర్ వేదికగా తెలిపాడు అర్షద్‌ వార్సీ.

లాక్‌ డౌన్‌ సమయంలో విధ్యుత  శాఖ కూడా పని చేసే పరిస్థితి లేకపోవటంతో ఆ మూడు నెలలు కరెంటు బిల్లులు రాలేదు. దీంతో కొంత మంది ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకొని కరెంట్ బిల్లు పే చేసినా మరికొంత మంది బకాయిలను అలాగే వదిలేశారు. దీంతో మూడు నెలల తరువాత కరెంటు బిల్లులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. స్లాబ్ రేటు మారటంతో పాటు ఇతర కారణాలతో భారీగా కరెంటు బిల్లు వస్తున్నాయి.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమకు వచ్చిన భారీ పవర్ బిల్స్ విషయంలో అసహనం వ్యక్తం చేయగా.. మరికొందరు ఫన్నీగా కామెంట్  చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఇంటికి లక్ష రూపాయలకు పైగా కరెంటు బిల్లు వచ్చిందని ట్విటర్ వేదికగా తెలిపాడు అర్షద్‌ వార్సీ. తన ఇంటికి ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు కట్టేందుకు తను వేసిన పెయింటింగ్స్‌ అన్ని అమ్మేస్తానని, వచ్చే నెల కూడా ఇదే స్థాయిలో బిల్లు వస్తే నా రెండు కిడ్నీలు అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నా అంటూ సరదాగా కామెంట్ చేశాడు అర్షద్‌ వార్సీ. అయితే వెంటనే స్పందించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ సమస్యను పరిష్కరించటంతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు అర్షద్‌.

ఇప్పటికే నటుడు ప్రసన్న, తాప్సీ, సందీప్ కిషన్‌, హ్యూమా ఖురేషీ, సోహా అలీఖాన్‌, డినోమోరియా లాంటి వారు తమకు వచ్చిన భారీ కరెంటు బిల్లుపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సామాన్యులకు కూడా ఇదే స్థాయిలో బిల్లు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి ఏకంగా రూ. 25,11,467 బిల్లు వచ్చినట్టుగా చూపించారు. సాధారణంగా 600లకు మించని కరెంటు బిల్లు ఒక్కసారిగా 25 లక్షలకు పైగా రావటంతో సదరు వినియోగదారుడికి గుండె ఆగినంత పనైంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా